Brathimiladu chunnadhi na yesu prema బ్రతిమాలుచున్నది నాయేసు ప్రేమ


Song no:

బ్రతిమాలుచున్నది నాయేసు ప్రేమ
దినదినము నిన్ను బ్రతిమాలుచున్నది " 2 "
వీధి వీధి తిరిగి నీ ఇంటికొచ్చి
పదే పదే నిన్ను బ్రతిమాలుచున్నది  " 2 "
పదే పదే నిన్ను బ్రతిమాలుచున్నది
                         "  బ్రతిమాలుచున్నది  "

లోక స్నేహము దేవునితో వైరము
ఆ స్నేహము నీవు విడువాలని  " 2 "
పరము నుండి దేవుడు ధరణికి వచ్చి
తనతో స్నేహం చేయమనుచు  " 2 "
పదే పదే నిన్ను బ్రతిమాలుచు
చేతులు చాచి పిలుచుచున్నాడు " 2 "
                     "  బ్రతిమాలుచున్నది  "

పాపిగానే నీవు ఉన్నప్పుడు
క్రీస్తు యేసు నీకొరకే మరణించెను  " 2 "
శిక్ష నుండి నిన్ను తప్పించాలని
పరలోక పౌరత్వం ఇవ్వాలని  "  2  "
పదే పదే నిన్ను బ్రతిమాలుచు
చేతులు చాచి పిలుచుచున్నాడు " 2 "
                     "  బ్రతిమాలుచున్నది  "

ఏయోగ్యత లేని నిన్ను పిలచి
దివ్యమైన తన సేవను అప్పగించెను " 2 "
లోకభోగాలకు బానిస కాక
లోకమంతా సువార్తను ప్రకటించాలని " 2 "
పదే పదే నిన్ను బ్రతిమాలుచు
కన్నీళ్లతో నిన్ను అడుగుచున్నాడు  " 2 "
                     "  బ్రతిమాలుచున్నది  "
أحدث أقدم