Brathiki vunnanante nee krupa jeevisthunnanante బ్రతికి ఉన్నానంటే నీ కృప జీవిస్తున్నానంటే నీ కృప


Song no:

బ్రతికి ఉన్నానంటే నీ కృప జీవిస్తున్నానంటే నీ కృప॥2॥
ఏ యోగ్యత నాలో లేదు ఎంత భాగ్యము నిచ్చావు ॥2॥
పరిశుధ్ధత నాలో లేదు నీ ప్రేమను చూపావు
యేసయ్యా నా యేసయ్యా ॥4॥

1.నా జీవిత నావ సాగుచుండగా
తుఫానులు వరదలు విసిరి కొట్టగా
కదల లేక నాకథ ముగించబోగా॥2॥
నీవు పద అంటూ నన్ను నడిపించావు
సదా నిన్నే సేవిస్తూ సాగిపోయెదన్
నీ పాదాల చెంతనే వాలి పోయెదా ॥2॥
॥యేసయ్యా॥             ॥బ్రతికి ఉన్నానంటే॥

2.నా జీవితమంతా ప్రయాసలు పడగా
శోధనల సంద్రములో మునిగిపోగా
నా ఆశల తీరం అడుగంటిపోగా॥2॥
ఆప్యాయత చూపి ఆదరించినావు
నీకృపలోనే నా బ్రతుకు ధన్యమైనదీ
నీకృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా ॥2॥
॥యేసయ్యా॥              ॥బ్రతికి ఉన్నానంటే॥
أحدث أقدم