Kreesthu lechenu halleluya kreesthu nannu lepunu క్రీస్తు లేచెను హల్లెలూయ క్రీస్తు నన్ను లేపును

Song no: 219


క్రీస్తు లేచెను హల్లెలూయ క్రీస్తు నన్ను లేపును

ఇద్దియె సునాద సత్యము ఇలను చాటుడి నిత్యము


1. మృతుల పునరుత్థాన పంటకు ప్రధమ ఫలమగు క్రీస్తులో

మృతులు లేతురు నేను లేతును నాదువరుసలో నిజమిది


2. పాపమరణ నరకబలములు ప్రభుని శక్తికి ఓడెను

పాపినగు నను బ్రోవ క్రీస్తుని ప్రాణదాన ప్రభావము


3.  మరణమా నీ ముల్లు ఎక్కడ? మరణమా జయమెక్కడ?

మరణమా నీ ముల్లు విరిగెను మహిమ క్రీస్తులో నిప్పుడు


4.  శిలయు ముద్రయు బలిమికావలి గలిబిలియాను రాత్రిలో

ఇలయు పరమును కలుసుకొనియెను గెలుపునొందిన క్రీస్తులో


5. మృతులు నీదగువారలందరు బ్రతికి లేతురు సత్యము

ప్రేతలను జీవింపజేయును పృధివి క్రీస్తుని విజయము


6. స్తుతియు మహిమయు ఘనత నీకె స్తుతికి పాత్రుడ రక్షకా

స్వంత రక్తము చిందితివి నా స్వామి యిదెనా యంజలి
أحدث أقدم