Yentho dhinathi dhinamu yesayya nee jananamentho ఎంత దీనాతి దీనమొ యేసయ్యా

Song no:

    ఎంత దీనాతి దీనమొ యేసయ్యా - నీ జననమెంతో దయనీయమో
    తలుచుకుంటే నా గుండే తడబడి కరిగి కరిగి నీరగుచున్నది.
    ఈ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా
    ఆ సత్రములో ఓ యేసయ్య నీకు స్ధలమే దొరకలేదయ్య "ఎంత"

  1. నిండు చూలాలు మరియమ్మ తల్లి నడవలేక సేడివడి పోయెనయ్యా
    దిక్కుతోచక ఓ యేసయ్య పశువు పాకలొ ప్రసవించెనయ్యా "ఎంత"

  2. చల్లగాలిలో చాటులేక నలుమూలలా చలి పుట్టేనయ్యా
    పసికందువై ఓ యేసయ్యా తల్లి ఒడిలో ఒదిగినావయ్య "ఎంత"
أحدث أقدم