Marani devudavu nivenayya marugai yundalenu మారని దేవుడవు నీవేనయ్యా మరుగై యుండలేదు


Song no:

మారని దేవుడవు నీవేనయ్యా - మరుగై యుండలేదు నీకు యేసయ్యా - 2
సుడులైనా.. సుడిగుండాలైనా - వ్యధలైనా.. వ్యాధిబాధలైనా
మరుగై యుండలేదు నీకు యేసయ్యా - 2

1. చిగురాకుల కొసల నుండి - జారిపడే మంచులా
నిలకడలేని నా - బ్రతుకును మార్చితివే = 2
మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా - 2
మరువని దేవుడవయ్యా - మారని యేసయ్యా - 2

2. నా జీవిత యాత్రలో - మలుపులెన్నో తిరిగిన
నిత్యజీవ గమ్యానికి - నను నడిపించితివే = 2
నిలిచి ఉందునయ్యా - నిజ దేవుడవనుచూ - 2
నన్ను చూచినావయ్యా - నన్ను కాచినావయ్యా - 2
أحدث أقدم