Sundharamaina dhehalenno shidhilamu kaledha సుందరమైన దేహాలెన్నో శిథిలము కాలేదా

John wesly
Song no:
సుందరమైన దేహాలెన్నో శిథిలము కాలేదా?
అంబరామాంటిన రాజులెందరో అలసిపోలేదా ?
కలములు పట్టిన కవులు ఎందరో కనుమరుగవలేదా?
ధరణిలోన ధనికులెల్లరు దహనం కాలేదా?
ఏది శాశ్వతం కాదేదీ శాశ్వతం
తరచి చూడుము పరికించి చూడుము “2” “సుందరమైన”

నెత్తుటి చారలను లికించిన రాజులెందరో
ఆ నెత్తుటిలోనే ప్రాణాలు విడచిపోయారు
అదికారా దహముతో మదమెక్కిన వీరులు
సమడి లోతుల్లోనే మూగబోయారు “2”
తపోబలము పొందిన ఋషులందరూ
మతాదికారులు మటాదిపతులు
ఈ కాల గర్బములోనే కలసిపోయారు
మరణ పిడికిళ్ళలో బందిలయ్యారు  “ఈ కాల”

యేసు లేని జీవితం వాడబారిన చరితం  “2”
క్రీస్తు ఉన్న జీవితం భూవిలో  చరితార్దం  “2” సుందరమైన”

ప్రాణం పోసిన దైవాన్ని కాదంటే
ఆ జీవితానికి పరమార్దం ఉంటుందా
పాప సంకేళ్లలో బందీలైన వారికి
ఆ దివ్య మోక్షం చేరుకునే భాగ్యం ఉంటుందా ? “ప్రాణం పోసిన”

శరీరాన్ని విడచిన మనుష్య ఆత్మకు
మరో జీవితం లేదనుట భావ్యమా
రక్తము కార్చిన యేసును విస్మరించి
ఈ సృష్టిని పూజించుట మనిషికి న్యాయమా?  “2”

యేసు లేని జీవితం అంధకార బంధురం
క్రీస్తు ఉన్న జీవితం తేజోమయ మందిరం “2” “సుందరమైన”
أحدث أقدم