Bahuga bahu bahu bahuga nanu dhininchinu బహుగా బహు బహు బహుగా నను దీవించెను


Song no: o

బహుగా బహు బహు బహుగా
నను దీవించెను-తన కృపలోన
నన్ను దాచియుంచెను     " 2 "
తన మహిమతో  నాతో  మాట్లాడును 
అరచేతిలో నన్ను చెక్కియుంచెను 
విడువని దేవుడు నన్నెన్నడు ఎడబాయడు 
                                          " బహుగా "

నా యెడల నీ తలంపులు విస్తరములు
అవి లెక్కించిన లెక్కకు మించియున్నవి 
నా పాప బ్రతుకంతా జ్ఞాపకము చేసికొనక 
నీ సాక్షిగా నన్ను నిలువబెట్టినవయ్యా  " 2 "
అబ్రాహాము దేవుడవు-అద్వితీయుడవు నీవు 
అందరికి ప్రభువైనఆదరణ కర్తవు 
ఏమని పాడెదను నీ శాశ్వత ప్రేమకై 
ఏమని చాటెదను నీ నిత్యమైన కృపకై
                                        " బహుగా "

నాతల్లి గర్భమందే నన్ను ప్రతిష్టించితివి 
నీకొసమే నన్ను ఏర్పరుచుకుంటివి 
నా మట్టుకు బ్రతుకు క్రీస్తు చావైతే లాభమే 
నీకోసమే నేను సైనికుడనైతిని   " 2 "
నా దేవ దేవుడవు-నా ప్రాణ ప్రియుడవు 
నరులందరి ప్రభువైనన్యాయాధిపతి నీవు
ఏమని పాడెదను నీ శాశ్వత ప్రేమకై
ఏమని చాటెదను నీ నిత్యమైన కృపకై

                                      "  బహుగా "
أحدث أقدم