الصفحة الرئيسيةEaster📜 లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా byOnline Lyrics List —مارس 20, 2024 0 288 "మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మింగి వేయును." యెషయా Isaiah 25:8" లేచినాడురా సమాధి గెలిచినాడురా - యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా లేతునని తా జెప్పినట్లు - లేఖనములో పలికినట్లు భద్రముగా సమాధిపైని - పెద్దరాతిని యుంచిరి భటులు ముద్రవేసి రాత్రియంత - నిద్రలేక కావలియున్న || లేచినాడురా || ప్రభువు దూత పరము నుండి - త్వరగా దిగి రాతిని పొర్లించి భళిర దాని పై కూర్చుండె - భయము నొంద కావలివారు || లేచినాడురా || ప్రొద్దు పొడవక ముందే స్త్రీలు - సిద్ధపరచిన సుగంధమును శ్రద్ధ తోడ తెచ్చి యేసుకు - రుద్దుదామని వచ్చి చూడ || లేచినాడురా || చూడ వెళ్ళిన స్త్రీలను దూత - చూచి యపుడే వారితోడ లేడు గలిలయ ముందుగ పోతున్నాడు అపుడే లేచినాడని || లేచినాడురా || చచ్చిపోయి లేచినాడు - స్వామి భక్తుల కగుపడినాడు చచ్చినను నను లేపుతాడు - చావు అంటె భయపడరాదు || లేచినాడురా || నేను చేసే పనుల నెరుగు - నేను నడిచే మార్గ మెరుగు నేను చెప్పు మాట లెరుగు - నేను బ్రతికే బ్రతుకు నెరుగు || లేచినాడురా || నేను లేచిన యేసు నందు మానక మది నమ్ముకొందు తాను నాలో యుండినందున - దయను జేర్చును మోక్షమందు || లేచినాడురా || పాప భారము లేదు మనకు - మరణ భయము లేదు మనకు నరక బాధ లేదు మనకు - మరువకండి యేసు ప్రభున్ || లేచినాడురా || యేసునందే రక్షణభాగ్యం - యేసునందే నిత్యజీవం యేసునందే ఆత్మశాంతి - యేసునందే మోక్షభాగ్యం || లేచినాడురా || పాపులకై వచ్చినాడు - పాపులను కరుణించినాడు పాపులను ప్రేమించినాడు - ప్రాణదానము చేసినాడు || లేచినాడురా || Lechinaaduraa samaadhi gelichinaaduraa yesu lechinaaduraa samaadhi gelichi naaduraa Lethunani thaa jeppinatlu - lekhanamulo paliki natlu Bhadramugaa samaadhi paini - pedda raatini yunchiri bhatulu - mudravesi raatriyantha nidraleka kaavaliyunna || Lechinadura || Prabhuvu doota paramunundi - thwaragaa digi raatini porlinchi bhalira daanipai koorchunde - bhayamu nonda kaavalivaaru || Lechinadura || Proddu podavaka munde sreelu - siddaparachina sugandhamunu shradda thoda thechi yesuku - ruddudaamani vachchi chooda || Lechinadura || Chooda vellina sreelanu doota - choochi yapude vaari thoda ledu galaliya munduga pothunnaadu - apude lechinaadani || Lechinadura || Chachchi poyi lechinaadu - swamy bakhtula kagupadinaadu chachichinanu nanu leputhaadu - chaavu ante bhayapada raadu || Lechinadura || Nenu chese panula nerugu - nenu nadiche maarga merugu - nenu cheppu maata lerugu - nenu brathike brathuku nerugu || Lechinadura || Nenu lechina yesunandu maanaka madi nammu kondu thaanu naalo yundi nanduna - dayanu jerchunu mokshamandu || Lechinadura || Paapa bhaaramu ledu manaku - marana bhayamu ledu manaku - naraka baadha ledu manaku - maruva kandi yesu prabhuni || Lechinadura || Yesu nande rakshana bhaagyam - yesu nande nitya jeevam - yesu nande aatma shaanti - yesu nande moksha bhaagyam || Lechinadura || Paapulakai vachinaadu - paapulanu karuninchinaadu - paapulanu preminchinaadu praana daanamu chesinaadu || Lechinadura ||