guruthu chesuko o priyuda గురుతు చేసుకో ఓ ప్రియుడా

Song no:

    గురుతు చేసుకో ఓ ప్రియుడా
    గుడిలో చేసిన ప్రమాణ సూత్రము
    మరిచిపోకుమా ఓ ప్రియతమా
    మెడలో కట్టిన ఆ మంగళసూత్రం
    తిరగబడితే క్రీస్తు కొరడా చెళ్ళమంటుందీ శుద్ధీకరణ

  1. స్వదేశీ సంసృతి మరిచి విదేశీ సంసృతి మరిగి
    ఆత్మీయతను అణచి అనురాగాన్ని విడచి
    పబ్ క్లబ్ల తైతక్కలాడి కాముకత్వము తలకెక్కి
    భార్యాభర్తల మార్పిడి చూడు
    కుటుంబ వ్యవస్థ దోపిడి నేడు

  2. సాటి సహాయము మరిచి సూటిపోటీగా పొడిచి
    భర్తను అనుమానించి పిల్లల భవితను విడిచి
    ఇంటి గుట్టును రట్టుగ చేసి భార్యనెదిరించి గడప దాటితే
    పెళ్ళి కాస్త పెటాకులై కొంప కొల్లేరౌతుంది
أحدث أقدم