గలిలయ తీరాన చిన్ననావ
యేసయ్య ఏర్పరచు కున్ననావ
యేసయ్య సేవలో వాడబడిన
యేసయ్య బోధకు ఉపయోగపడిన
ఆ నావలా నేనుంటే చాలునయ్యా.
యేసయ్య రాకకై ఎదురు చూసిన
యేసయ్యను మోస్తూ పరవశించినా
ఆత్మల సంపాదనకై వాడబడిన
ఆశ్చర్య కార్యములెన్నో చూసినా
ఆ నావలా నిన్ను మోస్తే చాలునయ్యా
సుడిగుండాలెన్నో ఎదురొచ్చినా
పెనుతుఫానులెన్నో అడ్లోచ్చినా
ఆగకుండా ముందుకే కొనసాగినా
అలుపెరుగని సేవకై సిద్ధపడిన
ఆ నావలా నన్ను కూడా వాడుమయ్యా
إرسال تعليق