బ్రతికెద నీ కోసమే నా ధ్యానమే
నా జీవితమే నీ కంకితమై
నీదు సేవజేతు పుణ్యమని భావింతు నేను చివరి శ్వాస వరకు
బ్రతికెద నీ కోసమే (స్వామీ) బ్రతికెద నీ కోసమే
1. శ్రమయును బాధయు నాకు కలిగిన వైరులు ఎల్లరు నన్ను చుట్టినా
నీదు న్యాయ శాసనమునే పాటింతు
నాలోని బలము నన్ను విడచినా నా కన్నుదృష్టి తప్పిపోయినా
నిన్ను చేరి నీదు శక్తి పొంది నీదు ఆత్మతోడ లోక రక్షకా
2. వాక్యమే మ్రోగుట విశ్వాసము వెల్లడి చేయుట
ఇహమందును యోగ్యమైన కార్యముగా నే తలచి
నీదు రుధిరంబు చేత నేను కడగబడిన నీదు సొత్తు కాదా
నిన్ను జూప లోకంబులోన నీదు వెలుగు దీపముగా నాధా
إرسال تعليق