Em vintharo iedhem kanthiro ఏం వింతరో ఇదేం కాంతిరో

Song no: 209

    ఏం వింతరో ఇదేం కాంతిరో
    జనులందరికీ మహా సంబరమంటరో } 2
    ఆ ఎలుగు సూడలేక కళ్ళు సెదిరిపోయే
    సంతోషం పట్టలేక మనసు మూగబాయె } 2 || ఏం వింతరో ||

  1. పశువుల తొట్టి పొత్తిగుడ్డల చుట్టలో
    మన సింతలు దీర్చోడు మన బాధలు బాపోడు } 2
    దావీదు పురములో రక్షకుడు ఎలిసె
    ఆలస్యమేల ఇక ఆనవాలు తెలిసె } 2 || ఏం వింతరో ||

  2. రెక్కలు విప్పుకొని సక్కసక్కని దూతలు
    సమాధానమంటూ పాడుతుండ్రు పాటలు } 2
    పామరులం మనకే ముందుగా తెలిసె
    గొప్పోళ్ళ సిగ్గుదీయ మనకు దారి తెరిచె } 2 || ఏం వింతరో ||

  3. మెస్సీయ వస్తని ఎదురుచూస్తే ఇంతదాక
    వచ్చిండదిగో సూడు మురుస్తుంది పసులపాక } 2
    వినవచ్చుచున్నది సక్కగాను శిశువు కేక
    సాటుదాం అందరికీ రక్షకుడు యేసురాక } 2 || ఏం వింతరో ||
أحدث أقدم