Athyunnatha simhasanamupai lyrics అత్యున్నత సింహాసనముపై

అత్యున్నత సింహాసనముపై ఆశీనుడవైన నా దేవా
అత్యంత ప్రేమా స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే
ఆహ.. హ.. హల్లెలూయ (3), ఆమేన్
1. ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచన కర్తా స్తోత్రం
బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం
2. కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం కృపతో రక్షించితివే స్తోత్రం
నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణ కర్తా స్తోత్రం
3. మృత్యుంజయుడా స్తోత్రం మహా ఘనుడా స్తోత్రం మమ్మును
కొనిపోవ త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం
4. ఆమేన్ అనువాడా స్తోత్రం అల్ఫా ఓమేగా స్తోత్రం అగ్ని జ్వాలలవంటి
కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం

Post a Comment

أحدث أقدم