Pradhana vinedi pavanuda pardhana maku ప్రార్ధన వినెడి పావనుడా ప్రార్ధన మాకు

Song no: 383

పల్లవి: ప్రార్ధన వినెడి పావనుడా - ప్రార్ధన మాకు
నేర్పుమయా ..ప్రార్ధన..
1. శ్రేష్ఠమైన భావము గూర్చి - శిష్యబృందముకు నేర్పితివి
పరముడ నిన్ను – ప్రణుతించెదము – పరలోక ప్రార్ధన
నేర్పుమయా ..ప్రార్ధన..

2. పరమ దేవుడవని తెలిసి - కరము లెత్తి జంటగ మోడ్చి =
శిరమును
వంచి సరిగమ వేడిన - సుంకరి ప్రార్ధన
నేర్పుమయా ..ప్రార్ధన..

3. దినదినంబు చేసిన సేవ - దైవ చిత్తముకు సరిపోవ =
దీనుడవయ్యు
దిటముగ కొండను - చేసిన ప్రార్ధన
నేర్పుమయా ..ప్రార్ధన..

4. శత్రుమూక నిను చుట్టుకొని - సిలువపై నిను
జంపగను
శాంతముతో నీ - శత్రుల బ్రోవగ - సలిపిన ప్రార్ధన
నేర్పుమయా ..ప్రార్ధన..
أحدث أقدم