ఓ యౌవ్వనుడా నీవు అగ్ని కణం నీ యౌవ్వన బలమే దేవుని వరము

పల్లవి : ఓ యౌవ్వనుడా నీవు అగ్ని కణం - నీ యౌవ్వన బలమే దేవుని వరము (2)
వాడు వేడు వేడి చూడు - నీ అమూల్యమైన జీవితంతో
(దేశ)చరిత్ర మార్చగలవు గొప్ప చరిత్ర రాయగలవు (2)|| ఓ యౌవ్వనుడా ||

1.⁠ ⁠పరాయి దేశమునందు బానిసైన యోసేపు మహారాజుగా సింహాసనము ఎక్కెగదా - నువ్వు వినలేదా(2)
లోకాశలకు లోబడక పాపానికి తలవంచక (2)
దేవుని కొరకై బ్రతికాడు - తన ప్రజలకు రక్షణయైనాడు (2)|| వాడు వేడు ||

2.⁠ ⁠పరాయి దేశమునందు షడ్రక్ మెషక్ అబెద్నగో దేవుని కొరకు అగ్నిగుండంలో పడలేదా - నువ్వు వినలేదా (2)
భాషా తీరు మారినను పరిశుద్ధతను విడువక (2) దేవుని కొరకై బ్రతికారు
తమ దేవుని శక్తిని చూపారు (2)|| వాడు వేడు ||

3.⁠ ⁠పరాయి దేశమునందు బానిసైన దానియేలు దేవుని కొరకు సింహపు గుహలో పడలేదా - నువ్వు వినలేదా (2)
కట్టుబొట్టు మారినను విశ్వాసములో నిలకడగా(2)
దేవుని కొరకై నిలిచాడు తానున్న రాజ్యాన్ని మార్చాడు (2)|| వాడు వేడు ||

Post a Comment

أحدث أقدم