అందరు నను విడిచి దూరంపోతున్నా
నీవే తోడుండగా నీ సన్నిధి వెంటుండగా
ఈ పయనం ఆగనే ఆగదు యేసు
నా అడుగు జారనే జారదు
1. ఏడారిలో గూడబాతునై
రెక్కలు తెగిన పక్షినై
దారే కానరాకున్న గమ్యమే తెలియకున్నా
ఈ పయనం ఆగనే ఆగదు యేసు
నా అడుగు జారనే జారదు|| ఒంటరి ||
2. దప్పికతో నీటివాగుకై పరుగెడుతున్న దుప్పినై
ఆశే ఇకలేకున్నా ధైర్యమే మిగులకున్నా
ఈ పయనం ఆగనే ఆగదు యేసు
నా అడుగు జారనే జారదు|| ఒంటరి ||
3.ఓటమితో వట్టి మోడునై ఫలములులేని చెట్టునై
శ్వాసే ఆగిపోతున్నా ప్రాణమే మీగులకున్నా
ఈ పయనం ఆగనే ఆగదు యేసు
నా అడుగు జారనే జారదు || ఒంటరి ||
إرسال تعليق