నే సిద్ధపడి దిద్దుకొని చాటెదను సువార్త

నే సిద్ధపడి దిద్దుకొని చాటెదను సువార్త
నే కడగబడి నిలువబడి చాటెదను ప్రేమవార్త(2)
నే పాడెదను మరనాత
నే చాటెదను మరనాత (2)
మరనాత.. యేసయ్య వచ్చుచున్నాడు
మరనాత.. యేసయ్య త్వరగా రమ్ము (2)
ప్రభువు రాకడ వచ్చుచున్నది (2) || నే సిద్ధపడి ||

1️⃣. దైవ సన్నిదనే చట్రంలో
దైవ వాక్యమనే చట్టంతో (2)
క్రమముగ నే మలచబడి
పరిశుద్ధముగా తీర్చబడి (2)
ప్రభువు రాకకై సిద్ధపడెదన్ (2) || నే సిద్ధపడి ||

2️⃣. తీర్పు ఉందనే భీతితో
దేవుడు కోరిన రీతిలో (2)
క్రమముగనే నడుచుకొని
పరిపూర్ణతను పొందుకొని (2)
ప్రభువు రాకకై సిద్ధపడెదన్ (2) || నే సిద్ధపడి ||

Post a Comment

أحدث أقدم