గెత్సెమనె తోటలో క్రీస్తేసు వేదన మానవాళి విడుదల కొరకైన ప్రార్థన
మానవాళి విడుదల కొరకైన ప్రార్థన (2)
నీ కోసమే - నా కోసమే ఆ మరణ పాత్ర మన పాప ఫలితమే (2)
కలువరి వరకు సిలువ మోయాలని (2)
ఎరిగియుండి ఆ పాత్రను స్వీకరించెను
తన తండ్రి చిత్తమునకు తలవంచెను (2) || నీ కోసమే ||
సంపూర్ణ స్వస్థతతో నింపాలని (2)
గాయములు పొందుటకు సిద్దమాయెను
తన తండ్రి చిత్తమునకు తలవంచెను (2) || నీ కోసమే ||
అక్షయమగు రాజ్యములో చేర్చాలని (2)
మరణంపు ద్వారమున ప్రవేశించెను
తన తండ్రి చిత్తమునకు తలవంచెను (2) || నీ కోసమే ||