- కన్య మరియ గర్భమందున, ఇమ్మానియేలు జన్మించనే
చీకటిలో ఉన్న మన జీవితాలకు, వెలుగును నింపుటకు ఉదయించెనే (2)
సంతోషించి ఆరాధించుదాం, రండి సందడి చేసి ఆరాధించుదాం (2)
- దేవదూతలు వచ్చినారు, కాపరులకు శుభవార్త తెచ్చినారు
బాల యేసుని పూజించుటకు, వెళ్ళినారు యేసుని మ్రొక్కినారు (2)
సంతోషించి ఆరాధించుదాం, రండి సందడి చేసి ఆరాధించుదాం (2)
- లోక పాప భారము నీవు మోసావు, గొప్ప రక్షణను మాకిచ్చావు
పరలోకవాసులుగా మమ్ము చేసావు నీ కొరకు బ్రతుకుటకు మమ్ము నిలిపావు (2)
సంతోషించి ఆరాధించుదాం, రండి సందడి చేసి ఆరాధించుదాం (2) || రాజాధిరాజు ||
యూదుల రాజుగా జన్మించెనే పశుల తొట్టిలో పరుండ పెట్టెనే (2)
సంతోషించి ఆరాధించుదాం, రండి సందడి చేసి ఆరాధించుదాం (2)
إرسال تعليق