الصفحة الرئيسيةAKK📖 ఎన్నఁడు గాంచెదమో యేసుని నెన్నఁడు గాంచెదమో byOnline Lyrics List —فبراير 23, 2024 0 195 క్రీస్తునందు ప్రత్యక్షమైన దేవుని ప్రేమ రాగం - ఆనందభైరవి తాళం - కురుజంపె ఎన్నఁడు గాంచెదమో యేసుని నెన్నఁడు గాంచెదమో యెన్నఁడు జూతుము కన్నె కుమారుని సన్నుతి జేయుచును ||నెన్నఁడు|| అంధుల గాచె నఁట యెహోవా నందనుఁ డితఁడౌనట పొందుగఁ బాపాత్ములకొర కై తన ప్రాణము విడిచెనఁట ||యెన్నఁడు|| వేసిరి సిలువనఁట క్రీస్తుని జేసిరి హేళనఁట డాసిరి యూదులఁట బల్లెము దూసిరి ప్రక్కనఁట ||యెన్నఁడు|| చిందెను రక్తమఁట పరమ సంధులు దెల్పెనఁట నిందల కోర్చె నఁ ట మన దగు నేరము గాచెనఁట ||యెన్నఁడు|| ఆపద కోర్చెనఁట పాపపు మోపులు మోసెనఁట కోపము మాన్పెనఁ ట యెహోవా కొడుకై వెలసెనఁట ||యెన్నఁడు|| అక్షయుఁ డితఁడెనఁట జగతికి రక్షకుఁ డాయెనఁట దీక్షగ నమ్మిన నరులం దరికి ని రీక్షణ దేవుఁడఁట ||యెన్నఁడు||
إرسال تعليق