నీవులేని చోటది యేసయ్య నే దాగి క్షణముండలేనయ్యా
నీవు చూడని స్థలమేది యేసయ్య కనుమరుగై నేనుండలేనయ్య
""నీవువినని మనువేది యేసయ్య
నీవుతీర్చని భాదయేది యేసయ్య""-2
నీవు ఉంటే నావెంటా అదియే చాలయ్యా (4)
1.
కయీను కృర పగకు బలియైన హేబెలూ
రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు
అన్నల ఉమ్మడి కుట్రకు గురియైన యోసేపు
మరణ ఘోష గోతినుండి విన్న దేవుడవు
"చెవియొగ్గి నామొరను యేసయ్య నీవు వినకుంటే బ్రతుక లేనయ్య ""2
""నీవుంటే నావెంట అదియే చాలయ్యా"" (4)
||నీవు లేని||
2.
సౌలు ఈటె ధాటికి గురియైన దావీదు
ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు
""సైతాను పన్నిన కీడును మొత్త బడిన యోబును
గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు""2
నీతోడు నీ నీడా యేసయ్య నాకు లేకుంటే నే జీవించలేనయ్య
నీవుంటే నా వెంటా ఆడియెచాలయ్యా (4)
||నీవు లేని||
إرسال تعليق