Bosi navvula chinnari yesayya pravalinchinava pasula salalo బోసి నవ్వుల చిన్నారి యేసయ్యా

    బోసి నవ్వుల చిన్నారి యేసయ్యా
    ప్రవళించినావా పశుల శాలలో || 2 ||
    రారాజువు నీవే మమ్మనేలు వాడనీవే || 2 ||
    రక్షించువాడవు పరముకుచేర్చు వాడవు || 2 ||
    చింత లేదు నీవు ఉండగా || బోసి నవ్వుల ||

  1. వేదన లేదు దుఃఖము లేదు
    దీనుల కన్నీరు తుడిచావయ్యా || 2 ||
    కన్య మరియ ఒడిలో పసిపాపల
    చిరునవ్వు చల్లగా వినిపించగా || 2 ||
    దూత సైన్యమే స్తోత్రములు చేసిరి-
    యుదులరాజు వచ్చేనని చాటిరి || 2 ||
    శ్రమలన్నీ తీరేను రక్షణ దొరికేను
    మా హృదయాలు పరవశించెను || బోసి నవ్వుల ||

  2. సర్వోన్నతుడవు సర్వశక్తిమంతుడవు
    దోషము లేని ప్రేమనీదయ్యా || 2 ||
    దివిని వీడి భువికి నరావతారిగా
    పరమతండ్రి తనయుడై అవతరించగా || 2 ||
    జ్ఞానులు గొల్లలు నిన్ను పూజించిరి
    కానుకలర్పించి నిన్ను స్తుతించారు || 2 ||
    శ్రమలన్నీ తీరేను రక్షణ దొరికేను
    మా హృదయాలు పరవశించెను || బోసి నవ్వుల ||

Post a Comment

أحدث أقدم