الصفحة الرئيسيةA.R Stevenson 🎤 నాకేమి కొదువ నాధుడుండ ఇక శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్టపాలకుడు నాయేక రక్షకుడు byOnline Lyrics List —مارس 09, 2024 0 14 59 యెహోవా నా కాపరి రాగం - సావేరి (23-వ దావీదు కీర్తన) తాళం - త్రిపుట నాకేమి కొదువ నాధుఁడుండ నిఁక శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ట పాలకుఁడు నా యేక రక్షకుఁడు గనుక || నాకేమి || తనివి దీర మేళ్లనుభవింప నేను నను సదా మేళ్లనెడి పచ్చిక నదిమి మృదువుగఁ బండు కొనఁజేయును గనుక || నాకేమి || ఎంత శోధన యెండ యున్న నాకు నెంతకు నోరిగర దెపుడు శాంత జలములు నా చెంతనే యుండు గనుక || నాకేమి || తప్పిపోయిన నన్ దారిం బెట్టి నన్ను తెప్పరిల్లఁజేసి నాకుఁ దీరు నలసటను నా తప్పు మన్నించున్ కనుక || నాకేమి || నీతి మార్గమునన్ నిల్పున్ నన్ను ప్రభువు నీతి లేని నాకుఁ దనను నీతి దయ చేయున్ స్వ నీతిని ద్రుంచున్ గనుక || నాకేమి || చావు చీఁకట్ల శక్తియుండు ఆహా లోయలోఁబడి పోవలసినను నే వెరవకుందు నా దేవుండే తోడు గనుక || నాకేమి || మీఁదఁబడునట్టి శోధనలన్ ధరను నా దరికి రానీక దండము నన్ను బ్రోచుచును నా కాదరణ యౌను గనుక || నాకేమి || పగవారల్ సిగ్గు పడునట్లుగ నా జగము యెరుఁగని సౌఖ్యభో జన మగపరుచును హా తగినదే పెట్టున్ గనుక || నాకేమి || తన యాత్మానంద తైలంబుతో ప్రభువు ననుదినము తలయంటి విసుగ కొనక తుడుచును నా కన్నీళ్లన్ని గనుక || నాకేమి || పలువిధములైన భాగ్యములతో తండ్రి వెలుపలికి దిగవెడలునట్టి వెల గల గిన్నె నా కలిమిగాఁ జేయున్ గనుక || నాకేమి || బ్రదుకంతటన్ గృ పాక్షేమములు నా వదలకుండగ వచ్చు నాతో సుదినములు గల్గ నా పదలు సంపదలౌ గనుక || నాకేమి || దురితంబు లుండు ధరణి నాకు నిజము నిరవు కాఁదిక నెప్పటికి నా పరమ దేవుని మందిరమె నా యిల్లు గనుక || నాకేమి || || నాకేమి || రెండవ భాగము కావలసినవెల్ల - కనబడ గలవు - మనకు = ఏవియడిగిన - వాని నిచ్చి వేయును తండ్రి - ఇచ్చి || నాకేమి || ధనసహాయంబు - మనకుగలుగు నేడు అనుదినంబు - తండ్రి మనకు అక్కరలు తీర్చు - మన || నాకేమి || బస యేర్పాటులు మా - ప్రభువే చేయున్ - నా = బస దిగిన స్థలమందు మా - ప్రభువె నివసించున్ - మా || నాకేమి || ప్రభువు దూతలును - పరిశుద్ధులున్ - ఇక = విభవముగ మన మధ్య - మసలుచు వెల్గుచుందురుగా - హా || నాకేమి || జనకునియిష్ట - జనము వచ్చు ఇక తనకు యిష్టముగాని జనమును దరికి రానీయడు - ఈ || నాకేమి || మామిత్రులైన - మహిమ దూతలే - ఇక = క్షేమమునకై మాచుట్టు - చేరికాయుదురు - చుట్టు || నాకేమి || అందరుమేళ్ళు - అనుభవింప - ఇపుడు = విందుగా సమకూడు వార్తలు వినిపించును - తండ్రి || నాకేమి || ప్రభుని శరీర - రక్తములు - నా = ఉభయ జీవితములకు - మేలై ఉండును - నాకు || నాకేమి || నైజపాపములు - నశియించుటకే - మన = భోజనము వడ్డించును - రాజేస్వయముగా - దేవ || నాకేమి || నీ మనసులోనివి - నెరవేరును - ఇక = క్షేమముగనే ఉండవలయు - చింతలేకుండ - నీవు - చింతలేకుండ - గనుక || నాకేమి || నాకు నాతండ్రి - నరరూపముతో - ఇక = త్రైకునిరీతిగ కనబడి ధైర్య మిచ్చును - నాకు - ధైర్యమిచ్చును - గనుక || నాకేమి || జనక సుతాత్మ - లను దేవుడు - ఇక = ఘనముగా యుగములనన్నిట వినుతులొందును - నేనా - యన గొర్రెనే గనుక || నాకేమి || naakaemi koduva - naadhuDuMDa ika = SreekaruMDagu daevuDae naa SraeshTapaalakuDu - naayaeka rakshakuDu ganuka || naakaemi || ennaTikaina eMDanaTTi - ika = sanna pachchikavaMTi tarugani - sadupaayaM bul^ - naakennO chaeyun^ ganuka || naakaemi || tanivi teeran^ maeLLanubhaviMpa - naenu = nanu sadaa maeLLaneDi pachchika nadimi mRdhuvuga - paMDu - konajaeyunu ganuka || naakaemi || eMta SOdhana - yeMDayunna - naaku = eMtaku nnOrigara depuDu SaaMtajalamulu - naacheMtanae yuMDun^ ganuka || naakaemi || tappipOyina nan^ - daariMbeTTi - ika = tepparillachaesi naaku - teerchu nalasaTanu - naatappu manniMchun^ ganuka || naakaemi || neeti maargamun^ nilpunu nannu - ika = neetilaeninaaku tana su -neeti dayachaeyun^ sva-neetinin^ druMchun^ || naakaemi || chaavucheekaTla - SaktiyuMDu -ika = lOyalObaDi pOvalasinananu - nae veravakuMDa - naa daevuDae tODu ganuka || naakaemi || kashTaMbulanu chee-kaTi lOyalO - ika = spashTamuga ghanasaukhyamunu naadRshTikiMjoopi - naa - nashTamul^ deerchun^ ganuka || naakaemi || meedapaDunaTTi - SOdhanalan^ - naa - naadariki raaneeka daMDamu - nannu laaguchunu - naa - kaadharaNayaunu ganuka || naakaemi || pagavaaral^ siggu-paDunaTlugaa - ika = jagati yerugani - saukhyabhOjana maguparachuchun^ - haa - taginadae peTTun^ ganuka || naakaemi || tanayaatmanaMda - tailaMbutO - nannu = anudinamu talayaMTi visuga-konaka tuDuchunu - naa - kanuneeLLanni ganuka || naakaemi || paluvidhamulaina - bhaagyamulatO - naaku = velupaliki diga - veDalu naTTi velagalaginne - naa kalimigaa jaeyun^ ganuka || naakaemi || bratukaMtaTan^ kR-paakshaemamulu - naa = vadalakuMDagavachchu naatO - sudinamulugalgu - naa - padalu saMpadalau ganuka || naakaemi || duritaMbuluMDu - dharaNi naaku - ika = iravukaadika - neppaTikinaa parama daevuni - maMdirame naayillu ganuka || naakaemi || reMDava bhaagamu kaavalasinavella - kanabaDa galavu - manaku = aeviyaDigina - vaani nichchi vaeyunu taMDri - ichchi || naakaemi || dhanasahaayaMbu - manakugalugu naeDu anudinaMbu - taMDri manaku akkaralu teerchu - mana || naakaemi || basa yaerpaaTulu maa - prabhuvae chaeyun^ - naa = basa digina sthalamaMdu maa - prabhuve nivasiMchun^ - maa || naakaemi || prabhuvu dootalunu - pariSuddhulun^ - ika = vibhavamuga mana madhya - masaluchu velguchuMdurugaa - haa || naakaemi || janakuniyishTa - janamu vachchu ika tanaku yishTamugaani janamunu dariki raaneeyaDu - ee || naakaemi || maamitrulaina - mahima dootalae - ika = kshaemamunakai maachuTTu - chaerikaayuduru - chuTTu || naakaemi || aMdarumaeLLu - anubhaviMpa - ipuDu = viMdugaa samakooDu vaartalu vinipiMchunu - taMDri || naakaemi || prabhuni Sareera - raktamulu - naa = ubhaya jeevitamulaku - maelai uMDunu - naaku || naakaemi || naijapaapamulu - naSiyiMchuTakae - mana = bhOjanamu vaDDiMchunu - raajaesvayamugaa - daeva || naakaemi || nee manasulOnivi - neravaerunu - ika = kshaemamuganae uMDavalayu - chiMtalaekuMDa - neevu - chiMtalaekuMDa - ganuka || naakaemi || naaku naataMDri - nararoopamutO - ika = traikunireetiga kanabaDi dhairya michchunu - naaku - dhairyamichchunu - ganuka || naakaemi || janaka sutaatma - lanu daevuDu - ika = ghanamugaa yugamulananniTa vinutuloMdunu - naenaa - yana gorrenae ganuka || naakaemi || <