الصفحة الرئيسيةAKK📖 దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునం దెలియరే byOnline Lyrics List —فبراير 22, 2024 0 149 క్రీస్తునందు ప్రత్యక్షమైన దేవుని ప్రేమ రాగం - ఆనందభైరవి తాళం - కురుజంపె దేవుని ప్రేమ ఇదిగో – జనులార– భావంబునం దెలియరే కేవలము నమ్ముకొనిన – పరలోక – జీవంబు మనకబ్బును పరలోక – జీవంబు మనకబ్బును } 2 || దేవుని || సర్వలోకము మనలను – తన వాక్య – సత్యంబుతో జేసెను } 2 సర్వోపకారుడుండే – మన మీద – జాలిపరుడై యుండెను } 2 || దేవుని || మానవుల రక్షింపను – దేవుండు – తన కుమారుని బంపెను } 2 మన శరీరము దాల్చెను – ఆ ప్రభువు – మన పాపమునకు దూరుడే } 2 || దేవుని || యేసు క్రీస్తను పేరున – రక్షకుడు – వెలసి నాడిలలోపల } 2 దోసకారి జనులతో – నెంతో సు – భాషలను బల్కినాడు } 2 || దేవుని || పాప భారంబు తోడ – నే ప్రొద్దు – ప్రయాసముల బొందెడి } 2 పాపులందరు నమ్మిన – విశ్రాంతి – పరిపూర్ణమిత్తు ననెను } 2 || దేవుని || సతులైన పురుషులైనన్ – యా కర్త – సర్వ జనుల యెడలను } 2 సత్ప్రేమగా నడిచెను – పరలోక – సద్బోధలిక జేసెను } 2 || దేవుని || చావు నొందిన కొందరిన్ – యేసుండు – చక్కగా బ్రతికించెను } 2 సకల వ్యాధుల రోగులు – ప్రభు నంటి – స్వస్థంబు తా మొందిరి } 2 || దేవుని || గాలి సంద్రపు పొంగులన్ – సద్దణిపి – నీళ్లపై నడచినాడే } 2 మేలు గల యద్భుతములు – ఈలాగు – వేల కొలదిగ జేసెను } 2 || దేవుని || చేతుల కాళ్లలోను – రా రాజు – చేర మేకులు బొందెను } 2 పాతకులు గొట్టినారే – పరిశుద్ధ – నీతి తా మోర్వలేకన్ } 2 || దేవుని || ఒడలు రక్తము గారగ – దెబ్బలు – చెడుగు లందరు గొట్టిరి } 2 వడిముళ్లు తల మీదను – బెట్టిరి – ఓర్చెనో రక్షకుండు } 2 || దేవుని || ఇన్ని బాధలు బెట్టుచు – దను జంపు – చున్న పాప నరులను } 2 మన్నించు మని తండ్రిని – యేసుండు – సన్నుతితో వేడెను } 2 || దేవుని || రక్షకుడు శ్రమ బొందగా – దేశంబు – తక్షణము చీకటయ్యెన్ } 2 రక్షకుడు మృతి నొందగ – తెర చినిగి – రాతి కొండలు పగిలెను } 2 || దేవుని || రాతి సమాధిలోను – రక్షకుని – నీతిగల దేహంబును } 2 పాతి పెట్టిరి భక్తులు – నమ్మిన – నాతు లందరు జూడగా } 2 || దేవుని || మూడవ దినమందున – యేసుండు – మృతి గెల్చి లేచినాడు } 2 నాడు నమ్మిన మనుజులు – చూచిరి – నలువది దినములందున్ } 2 || దేవుని || పదునొకండు మారులు – వారలకు – బ్రత్యక్షు డాయె నేసు } 2 పరలోకమున కేగెను – తన వార్త – బ్రకటించు మని పల్కెను } 2 || దేవుని || నమ్మి బాప్తిస్మమొందు – నరులకు – రక్షణ మరి కల్గును } 2 నమ్మ నొల్లక పోయెడు – నరులకు – నరకంబు సిద్ధమనెను } 2 || దేవుని || Devuni Prema Idigo – Janulaara – Bhaavambunam Deliyare Kevalamu Nammukonina – Paraloka – Jeevambu Manakabbunu ||Devuni|| Sarvalokamu Manalanu – Thana Vaakya – Sathyambutho Jesenu Sarvopakaarudunde – Mana Meeda – Jaaliparudai Yundenu ||Devuni|| Maanavula Rakshimpanu – Devundu – Thana Kumaaruni Bampenu Mana Shareeramu Daalchenu – Aa Prabhuvu – Mana Paapamunaku Doorude ||Devuni|| Yesu Kreesthanu Peruna – Rakshakudu – Velasi Naadilalopala Dosakaari Janulatho – Nentho -Su Bhaashalanu Balkinaadu ||Devuni|| Paapa Bhaarambu Thoda – Ne Proddu – Prayaasamula Bondedi Paapulandaru Nammina – Vishraanthi – Paripoornamitthu Nanenu ||Devuni|| Sathulaina Purushulainan – Yaa Kartha – Sarva Janula Yedalanu Sathpremaga Nadichenu – Paraloka – Sadhbodhalika Jesenu ||Devuni|| Chaavu Nondina Kondarin – Yesundu – Chakkagaa Brathikinchenu Sakala Vyaadhula Rogulu – Prabhu Nanti – Swasthambu Thaa Mondiri ||Devuni|| Gaali Sandrapu Pongulan – Saddanipi – Neellapai Nadachinaade Melu Gala Yadbhuthamulu – Eelaagu – Vela Koladiga Jesenu ||Devuni|| Chethula Kaallalonu – Raa Raaju – Chera Mekulu Bondenu Paathakulu Gottinaare – Parishuddha – Neethi Thaa Morvalekan ||Devuni|| Odulu Rakthamu Gaaraga – Debbalu – Chedugu Landaru Gottiri Vadimullu Thala Meedanu – Bettiri – Orcheno Rakshakundu ||Devuni|| Inni Baadhalu Bettuchu – Danu Jampu – Chunna Paapa Narulanu Manninchu Mani Thandrini – Yesundu – Sannuthitho Vedenu ||Devuni|| Rakshakudu Shrama Bondagaa – Deshambu – Thakshanamu Cheekatayyen Rakshakudu Mruthi Nondaga – Thera Chinigi – Raathi Kondalu Pagilenu ||Devuni|| Raathi Samaadhilonu – Rakshakuni – Neethigala Dehambunu Paathi Pettiri Bhakthulu – Nammina – Naathu Landaru Joodagaa ||Devuni|| Moodava Dinamanduna – Yesundu – Mruthi Gelchi Lechinaadu Naadu Nammina Manujulu – Choochiri – Naluvadi Dinamulandun ||Devuni|| Padunokandu Maarulu – Vaaralaku – Brathyakshu Daaye Nesu Paralokamuna Kegenu – Thana Vaartha – Brakatinchu Mani Palkenu ||Devuni|| Nammi Baapthismamondu – Narulaku – Rakshana Mari Kalgunu Namma Nollaka Poyedu – Narulaku – Narakambu Siddhamanenu ||Devuni||