Chappattlu kotti galamu vippi ganthulu vesi చప్పట్లు కొట్టి గళము విప్పి గంతులు వేసి


గంతులు వేసి -  గానము చేసి
నిన్నారాధింతును  ... నేనారాధింతును

1. నక్షత్రములు నిను స్తుతియించ - ఆకాశాన్ని వెలిగించునట్లు 
పారె సెలయేరు నిను స్తుతియించ - దప్పిక తీర్చి జీవమిచ్చునట్లు
నా దేహమును సజీవ యాగముగా నీకర్పించి స్తుతియింతును 
నిన్నారాధింతును ... నేనారాధింతును

2. మేఘములు  నిను స్తుతియించ - ఎండిన భూమిని పండించునట్లు   
ఎగిరే పక్షులు  నిను స్తుతియించ - నీదు ప్రేమను చాటించునట్లు
నిన్ను ఘన పరచి నన్ను మైమరచి నిన్నే నేను స్తుతియింతును 
నిన్నారాధింతును ... నేనారాధింతును

3. పరిశుద్ధులు దూతగణములు - సదా నిన్ను స్తుతియించునట్లు 
చెరూబులు సెరాపులు - సదా నిన్ను స్తోత్రించునట్లు 
అద్వితీయుడనీ పరిశుద్ధుడు నీవనినిన్నే నేను స్తుతియింతును
నిన్నారాధింతును ... నేనారాధింతును





أحدث أقدم