తూర్పు నుండి పడమర కు ఎంత దురమో అంతా దూరం పోయేనే పాప భారము


Song no:

తూర్పు నుండి పడమర కు ఎంత దురమో
అంతా దూరం పోయేనే పాప భారము    "2"
యేసు నన్ను తాకగానే తొలగిపోయేను
నా పాపము నా పాప భారము   "2"  "తూర్పు"
రాతి వంటిది నాదు పాత హృదయము
మెత్తనైనా మాంసపు హృదయమయేను  "2"
ఎంత మధురమో నా యేసు రుధిరము
నా పాప కలుషములను కడిగివేసేను"2"  "తూర్పు"
పాప ఊబి నుండి నన్ను పైకి లేపేను
పరమజీవ మార్గమును నాకు చూపెను   "2"
ఎంత రమ్యమో నా యేసు రాజ్యము
యుగయుగములు అదే నాకు పరమ భాగ్యము  "2""తూర్పు"
أحدث أقدم