Anjurapu chettu puyaka poyinanu dhraksha chettu అంజూరపు చెట్లు పూయక పోయిననూ ద్రాక్ష చెట్లు


Song no:

అంజూరపు చెట్లు పూయక పోయిననూ
ద్రాక్ష చెట్లు ఫలించక పోయిననూ   !!2!!
నేను దేవునిలో సంతోషించెదను
నా ప్రభునందు ఆనందించెదను !!2!!
అన్నియును ఎదురై నాకు వచ్చినను
పరిస్థితులే అపజయముగా  నను మార్చి నను-2
నేను దేవునిలో సంతోషించెదను
నా ప్రభునందు ఆనందించెదను !!3!!
బంధువులే నన్ను విడిచిపోయినను
ఊరంతా నన్ను వెలివేసినను    !!2!! 
నేను దేవునిలో సంతోషించెదను
నా ప్రభునందు ఆనందించెదను !!3!!

గొర్రెలమంద దొడ్డిలో లేకపోయినను
శాలలో పశువులు లేకపోయినను...!!2!!
నేను దేవునిలో సంతోషించెదను
నా ప్రభునందు ఆనందించెదను !!3!!అంజూర!!
أحدث أقدم