Yedanumtiviraa oranna vegi viriki rara oranna ఏడానుంటివిరా ఓరన్న వేగి ఉరికి రారా ఓరన్న


Song no:


ఏడానుంటివిరా ఓరన్న
వేగి ఉరికి రారా ఓరన్న (2)
యాదికొచ్చెరా యాదన్న
యేసు సిత్ర కథ వినరన్న (2)
ఏలియాలో ఏలియాలో ఏలియాలో
యేసే నా రక్షకుడు ఏలియాలో
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయా
యేసే నా రక్షకుడు హల్లెలూయా (2)
యూదా దేశమందు ఓరన్న
బెత్లెహేమునందు ఓరన్న
పశువుల శాలయందు ఓరన్న
ప్రభు యేసు జన్మించె ఓరన్న
చుక్కల రెక్కలు ఎగుర వేయుచు
చల్లని దూతలు   పాడిరి (2)
చల్ల చల్లని చలిలోన ఓరన్న
గొల్ల గొల్లలు మ్రొక్కిరి ఓరన్న (2)        ||ఏలియాలో||
పెద్ద పెద్దని వాడై యేసన్న
ఇంత ఇంతింత ఎదిగె యేసన్న
వింత వింతలు చేసె యేసన్న
ఐదు రొట్టెలు రెండు చేపలు
ఐదు వేల మందికి పంచెను (2)
తుఫాను నణిచెను యేసన్న
సంద్రాన నడిచెను యేసన్న (2)        ||ఏలియాలో||
ఏ పాపమెరుగని ఓరన్న
యేసయ్య తండ్రిని ఓరన్న
సిలువ వేయమని ఓరన్న
కేకలు వేసిరి ఓరన్న
సిలువ మోసెను శ్రమల నోర్చెను
మూడవ నాడు తిరిగి లేచెను (2)
పరలోకమెళ్లాడు యేసన్న
త్వరలోనే వస్తాడు యేసన్న (2)        ||ఏలియాలో||

أحدث أقدم