iedhey christmas pandagaroju nede ఇదే క్రిస్మస్ పండుగరోజు నేడే శ్రీయేసుని


Song no:


ఇదే క్రిస్మస్ పండుగరోజు - నేడే శ్రీయేసుని పుట్టిన రోజు
క్రీస్తు ప్రభు నరరూపిగ - ధరకేతెంచిన రోజు ఈ రోజు
ఆహ ఆనందమే - ఆహ ఆశ్చర్యమే - రక్షకుని జననము
భయమేలనే భువియందున - జయరాజు జన్మంచెను (2) (ఇదే)
సర్వోన్నతుడు సర్వశక్తుడు
సర్వజనములకు రక్షణ దర్శనమిచ్చెను
పరమానందమే (ఇదే)
అన్యజనులకు ఆశ్రయదుర్గము
అంధకారముతో ఆశజ్యోతి (2)
వాత్సల్యముతో వెలుగుగా వచ్చెను
మహదానందమే (ఇదే)
ప్రియ కుమారుడు ఇమ్మానుయేలు
మార్గము సత్యము జీవమాయేసే(2)
అక్షయ మార్గము ఆనందింపవచ్చెను
నిత్యమానందమే (ఇదే)

أحدث أقدم