ఆవరించుమా ఆత్మ శక్తితో


ఆవరించుమా ఆత్మ శక్తితో
ఆదరించుమా నీదు వాక్కుతో
అ.ప: ప్రేమ రూపమా నన్ను నింపుమా
ఉజ్జీవము నాలో రగిలించుమా
1. నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన
సంగతులను చూచునట్లు కనులు తెరువుమా
2. నీ ఆగమనంకొరకు సిద్ధము చేసే
వాక్యమును ఆలకించు చెవులనీయుమా
3. నే నడుచు త్రోవలందు క్షేమమునిచ్చే
కట్టడలు గ్రహించే మనసు నిలుపుమా
4. నా దీనశరీరమును పాపమునుండి
కాపాడుకొనునట్టు భయము నేర్పుమా


أحدث أقدم