Goodu Leni Guvvanai lyrics


గూడు లేని గువ్వనై – కూడు లేని బిడ్డనై (2)
నీడ లేని మనిషినై – అందరిలో ఒంటరినై (2)
దారి తెలియని స్థితిలో నిలబడి ఉన్నాను
సహాయము కొరకు ఆర్జిస్తు ఉన్నాను (2)
అప్పుడొక మెల్లని స్వరము నాతో
మాట్లాడి చెప్పెను ప్రభువైన యేసుని (2)
ఎప్పుడైతే ఆ స్వరము విన్నానో నేను
నా జీవితమంత ప్రకాశింప సాగింది (2)         ||గూడు||
అప్పుడొక తియ్యని స్వరము నాతో
మాట్లాడి చెప్పెను ప్రియుడైన యేసుని (2)
ఎప్పుడైతే ఆ స్వరము విన్నానో నేను
నా పాప జీవితము పారిపో సాగింది (2)       ||గూడు||
అప్పుడొక అద్భుత స్వరము నాతో
మాట్లాడి చెప్పెను రాజైన యేసుని (2)
ఎప్పుడైతే ఆ స్వరము విన్నానో నేను
నా ప్రశ్నలన్నిటికి జవాబులు దొరికాయి (2)
గూడు ఉన్న గువ్వనై – కూడు ఉన్న బిడ్డనై (2)
నీడ ఉన్న మనిషినై – ఒక్కరిలో వెయ్యినై (2)
దారి తెలిసిన స్థితిలో నిలబడి ఉన్నాను
సేవలోని మాధుర్యము ననుభవిస్తున్నాను (2)
యేసుని నమ్ముకో – యేసుని చేరుకో
యేసుని కోరుకో – యేసుతో చేరిపో (4)
Goodu Leni Guvvanai – Koodu Leni Biddanai (2)
Needa Leni Manishinai – Andarilo Ontarinai (2)
Daari Theliyani Sthithilo Nilabadi Unnaanu
Sahaayamu Koraku Arjisthu Unnaanu (2)
Appudoka Mellani Swaramu Naatho
Maatlaadi Cheppenu Prabhuvaina Yesani (2)
Eppudaithe Aa Swaramu Vinnaano Nenu
Naa Jeevithamantha Prakaashimpa Saagindi (2)        ||Goodu||
Appudoka Thiyyani Swaramu Naatho
Maatlaadi Cheppenu Priyudaina Yesani (2)
Eppudaithe Aa Swaramu Vinnaano Nenu
Naa Paapa Jeevithamu Paaripo Saagindi (2)        ||Goodu||
Appudoka Adbhutha Swaramu Naatho
Maatlaadi Cheppenu Raajaina Yesani (2)
Eppudaithe Aa Swaramu Vinnaano Nenu
Naa Prashnalannitiki Javaabulu Dorikaayi (2)
Goodu Unna Guvvanai – Koodu Unna Biddanai (2)
Needa Unna Manishinai – Okkarilo Veyyinai (2)
Daari Thelisina Sthithilo Nilabadi Unnaanu
Sevaloni Maadhuryamu Nanubhavisthunnaanu (2)
Yesuni Nammuko – Yesuni Cheruko
Yesuni Koruko – Yesutho Cheripo (4)

Post a Comment

أحدث أقدم