మనిషికి పోవాల్సింది పాపమా? రోగమా?

మనిషికి పోవాల్సింది పాపమా? రోగమా?
పాపులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను.
1) కనిపించే శరీరము + కనిపించని ఆత్మల కలయికను మనిషి అంటారు. శరీరానికి సంభంధించిది రోగమైతే ఆత్మకు సంభంధించింది పాపమనే విషయము మనకు తెలిసిందే.. ఈ రోజు మనం వింటున్న రోగాలన్నీ శరీరానికే వస్తాయి. డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు మన శరీరాన్ని పరిశీలించి రోగమును నిర్దారిస్తాడు.ఆత్మను గూర్చి కానీ,ఆత్మకు అంటుకునే పాపాన్ని గూర్చి కానీ నేడుఅనేక మందికి అవగాహన లేదనే చెప్పాలి. మానవ శరీరములో దేవుడు ఆత్మను ఎందుకు ప్రవేశపెట్టాడో, ఎందుకు ఇంత చక్కని శరీరాలతో ఉన్నామోన్న సరియైన వివరణ బైబిల్లోనే మనకు కనపడుతుంది. శరీరానికి వచ్చిన రోగమును పోగొట్టుకొనుట ముఖ్యమా లేక శరీరంలో ఉంటున్న ఆత్మకు అంటున్న పాపాన్ని పోగొట్టుకొనుట ముఖ్యమా అని ప్రతి మనిషి ఆలోచించాల్సిన విషయము.
2) ఈ రోజు సమాజములో ఉన్న అనేకమందికి ఆత్మకు అంటుకున్న,అంటుకుంటున్న పాపంపై సరియైన అవగాహన లేదనే చెప్పాలి. బైబిల్లో అనేక సందర్భాలను ఆలోచిస్తే పాపాన్ని గురించే దేవుడు త్రీవంగా వ్రాయించినట్లుగా కనబడుతుందే తప్ప రోగాలపై గురించి దేవుడు ఎక్కడ త్రీవంగా వ్రాయించినట్టుగా లేదు. పాపం&రోగం అను ఈ రెండిటికి సరియైన పోలికలు ఆలోచిస్తే రోగం వలన మరణించేంత వరకు భాదపడుతాం.అనగా మరణించగానే ఈ శరీరానికి పట్టిన రోగాలను వదిలించుకుంటాం.రోగం అనునది స్మశానం వరకే పరిమితం. పాపం సంగతికి వస్తే మరణించిన తర్వాత కూడ మనం చేసిన పాపాలు రోగాలు వెళ్ళినట్లుగా వెళ్ళిపోవు . భూమి మీద బ్రతికి ఉన్నప్పుడు దేవునికి వ్యతిరేకముగా మనం చేసిన పాపాలు స్మశానంతో పోతాయి అనుకొనుట పొరపాటు.1 తిమోతి 5:24-కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరిపాపములు వారి వెంట వెళ్ళుచున్నవి.
3) రోగాలు మన వెంట రావని, అవి కేవలం స్మశానం వరకే అని అనగా మనం మరణించేంత వరకు మాత్రమే మన శరీరాన్ని రోగం పట్టి పిడుస్తుంది అని అర్థమవుతుంది. రోగాన్ని మరణించైన వదిలించుకోవచ్చు కానీ బ్రతికి ఉండగా మనం చేసిన పాపాలు మనంమరణించిన తర్వాత కూడ వెంట వస్తాయన్న వాస్తవం పై వచనములో తెలియజేయబడింది. భూమి మీద మరణించిన నాడు మనం ఏమి తీసుకుని వెళ్తాం అని భూ సంభందముగామనం సంపాదించినా విషయంలో ఆ మాట వర్తిస్తుంది కానీ మరణించినతర్వాత మన వెంట వచ్చేది భూమి మీద మనం చేసిన పాపాలు. ఇక పాపం వలన మనం నరకంలో భాదపడు కాలం కోట్ల సంవత్సరాలు అయితే రోగం వలన మనం భాదపడే కాలం బ్రతికి ఉన్నంత కాలం. రోగం వలన వచ్చే భాదలు కంటే పాపం వలన వచ్చే భాద చెప్పలేనిది ,వర్ణించలేనిది..
4) ఈ ప్రకృతిని కలిగించేటప్పుడే ఈ శరీరానికి కావాల్సినవన్నీ దేవుడుప్రకృతిలో పెట్టాడు. అనగా ఈ ప్రకృతిలో ఆహారముతో పాటు ఒకవేళ అనారోగ్యం వస్తే తగ్గించుటకు ఉపయోగపడే మందులను కూడ పెట్టాడు. ప్రపంచములో ఉంటున్న మందుల తయారీ అంతా దేవుడు కలిగించిన ఈ ప్రకృతి నుండే జరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే మన ఆరోగ్యాన్ని గురించి దేవుడు ముందుగా అలోచించి ఈ శరీరానికి భూసంభంధమైన అవసరాలను తీర్చటానికి ఆహారముతో పాటు మనకు కావాల్సిన ప్రతిది ఈ ప్రకృతిలో పెట్టాడు.శరీరంలో ఉన్న రోగాన్ని తీసివేయడానికి ప్రపంచములో చాలా మంది వైద్యులు ఉన్నారు కానీ పాపమును తీసివేయుటకు ఎవరి తరం కాదు. రోగం తీసివేయుటకు మందులు,డాక్టర్లు,ఆసుపత్రిలుఉన్నాయి కానీ పాపాన్ని తీసివేయుటకు లేరు.
5) శరీరం మట్టిలో నుంచి వచ్చింది కనుక ప్రతి అవసరాన్ని మట్టిలోనే దేవుడు పెట్టాడు. మనలో ఉన్న ఆత్మ సాక్షాత్తు దేవునిలో నుండి వచ్చింది కనుక ,మట్టిలో నుంచి రాలేదు కనుక దీని అవసరాలు ఈ మట్టి ప్రపంచములో లేవు. ఆత్మ పరలోకం నుండి వచ్చింది కనుక ఆత్మకు  సంభందించిన అవసరాలు  పరలోకం నుండే తీరాలి. ఆత్మకు సంభందించి అవసరాలు పరలోకం నుండి భూమి మీదకు వస్తే తప్ప తీరవు. అందుకే పరలోకపు తండ్రి తన కుమారునిని పాపులను రక్షించుటకు ఈ లోకానికి పంపించాడు. 1 తిమోతి 1:15-పాపులను రక్షించుటకు  క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను...... రోగాలను తీసివేయుటకు పరలోకం నుండి భూమి మీదకు రావాల్సిన అవసరత యేసుక్రీస్తుకు లేదు.
6) మనిషికి పట్టిన పాప రోగాన్ని వదిలించుటకు ఈ భూమి మీద మనుషులు ఎవ్వరు చేయలేని కార్యము చేయుట కొరకు యేసుక్రీస్తు వచ్చాడు. ఆత్మకు పట్టిన పాపాన్ని వదిలించడం భూమి మీద ఎవరి వలన కాదు. ప్రతి ఒక్కరు భూ సంభందమైన వారు కనుక, అందరు పాపం చేసారు కనుక పాపమునకు సంభందించిన మందులు ఈ భూమి మీద లేవు కనుక డాక్టర్ పరలోకం నుండి రావాలి.
7) మార్క్ 2:1 నుండి 9 వరకు చూస్తే-కొన్ని దినములైన పిమ్మట అయన మరల కపెర్నేహుములోనికి వచ్చెను.అయన యింట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికీ స్థలము లేకపోయెను. అయన వారికీ వాక్యము భోదించుచుండగా కొందరు పక్ష వాయువువారి గల ఒక మనుష్యుడిని నలుగురి చేత మోయించుకుని అయన యొద్దకు తీసుకుని వచ్చిరి.......... యేసువారి విశ్వాసము చూచి-కుమారుడా ,నీ పాపములు క్షమింపబడి యున్నవని పక్ష వాయువు గల వానితో చెప్పెను........... నీ పాపములు క్షమింపబడియున్నవని చెప్పుట సులభమా ?నీవు లేచి నీ పరుపెత్తికొని నడువుమని చెప్పుట సులభమా?....... పై వచనాలు పరిశిలిస్తే రోగం పోగొట్టుకోవడానికి వాళ్ళు తీసుకుని వస్తే యేసుక్రీస్తు రాగానే వెంటనే నీ పాపాలు క్షమింపబడియున్నవి అని అంటున్నాడు. ఎందుకు యేసుక్రీస్తు ఇలా అన్నాడు? వాస్తవముగా మనిషికి జరగవలసినది పాప క్షమాపణ. అసలే చావు బ్రతుకుల మధ్య పక్ష వాయువు తో  ఉన్నాడు . చావు బ్రతుకుల మధ్య ఉంటున్న ఇతనికి ముందుగా కావాల్సింది పాప క్షమాపణ అని యేసుక్రీస్తు  గుర్తు ఎరిగిఅలా అన్నాడు. చావు బ్రతుకుల మధ్య ఉన్న వాడికే పాప క్షమాపణ అవసరం అయితే మరి బ్రతికి ఉండేవాడికి ఇంకెంత అవసరమో ఆలోచించాలి..9వ వచనములో చూస్తే నీ పాపములు క్షమింపబడియున్నవని చెప్పుట సులభమా ?నీవు లేచి నీ పరుపెత్తికొని నడువుమని చెప్పుట సులభమా?అను రెండు ప్రశ్నలు అడుగుతున్నాడు. ఈ రెండిటిలో ఏది సులభము & ఏది కష్టమో అని అడుగుతున్నాడు. పాపం తిసేయటం సులభమా లేక రోగం తిసేయటం సులభమా అని అడుగుతున్నాడు.
8)  శరీరాన్ని ఇచ్చింది దేవుడే, శరీరంలో ఆరోగ్యాన్ని ఇచ్చింది దేవుడే.నిజముగా భూమి మీద ఉన్న మనిషికి రోగం తీసేయడం కష్టం ఏమో కానీ దేవునికి కష్టమైనది ఏది లేదని మనం గుర్తించాలి.మనిషికి రోగం తీయుట కష్టం. ఈ పక్ష వాయువు గలవాడిని బాగు చేయడానికి యేసు కష్టపడ్డాడా? లేదు. అంటే యేసుక్రీస్తు భూమిమీద చేసిన ఏ అద్భుతముకు కష్టపడలేదుకేవలము మాట మాత్రం సెలవిచ్చాడు. అద్భుతం మాట వలన జరిగితే పాపాలు పోవుట మాత్రము  యేసు రక్తం ఇవ్వాలి. ఇది కష్టమైనది. సిలువ మీదకి వెళ్ళటానికి ముందు తన మరణాన్ని జ్ఞాపకంచేసుకుంటూ తండ్రితో యేసుక్రీస్తు అన్న మాటను చూస్తే మత్తాయి 26-38,39-అప్పుడు యేసు- మరణమగు నంతగా నా ప్రాణము  బహు దుఖములో మునిగియున్నది........
9) రోగం పోవాలంటే సులువుగా మాట మాత్రం సెలవిచ్చాడు కానీ పాపం పోవుట కొరకు మరణమగు నంతగా బహు దుఖములో రక్తం చిందించాడు.సిలువ మీద మరణించి శరీరము నుండి కారిన రక్తము వలన ప్రపంచ మానవాళి పాపాలు కడుగుటకు పూనుకున్నాడు. ఎంత భయంకరముగా యేసుక్రీస్తు సిలువపై రక్తం చిందించాడో మనకు తెలుసు.మానవాళి పాపాలు తీయటానికి ఎంత ఇబ్బంది ,కష్టము పడుతున్నాడో ఒక్కసారి ఆలోచించండి. ఇంత కష్టమైనప్పటికి యేసుక్రీస్తు సిలువ మరణం ద్వార పాపమును తిసివేసుకోనుటకు ప్రపంచ మానవాళికి అవకాశం ఇస్తే పాపం తిసివేసుకోనుటకునేడు మనిషికి ఆసక్తి లేదు. రోగంతీసుకోనుటలో ఉన్న శ్రద్ద,ఆసక్తి పాపం తిసుకోనుటలో లేదు.
10) శరీరానికి రోగాలు వస్తు పోతూ ఉంటాయి. ఏదో ఒక రోజు శాశ్వతముగా శరీరాన్ని విడిచి పెట్టి వెళ్ళిపోతాము. రోగాలు మనతో రానప్పుడు మరణంతో వదులుకునే రోగాలు గురించి ఎందుకు ఆలోచించాలి??? శరీరానికి వచ్చిన రోగము ఎప్పటికి పరలోకానికి అడ్డుగా ఉండదు. ఫలానా రోగంతో చచ్చిపోయవు కనుక నీకు పరలోకం రాదు అని దేవుడు ఎక్కడ అనలేదు . పరలోకం వెళ్ళాలంటే పాపాలు ఉండకూడదు. ఆనాటి నుండి ఈనాటి వరకు మనిషి బ్రతికినంత కాలం రోగం గురించి ఆలోచిస్తున్నాడు కానీ పాపం తిసేసుకోనుట గురించి ఆలోచన లేదు.
11) ముందుగాప్రతి మనిషీ యేసుక్రీస్తు రక్తంలో పాపాలు కడగబడిన తర్వాత పరలోకానికి మన జీవితాన్ని నడిపించుకుంటూ ఆ తర్వాత తండ్రి నీ కోసం బ్రతకడానికి ఈ శరీరం సహకరించుట లేదు కనుక నాకు ఆరోగ్యం ఇవ్వుమని అడగండి. మొదట యేసు ఇచ్చిన రక్తాన్ని ఉపయోగించుకుని మన పాపాలు కడుగుకోవటం చాలా ముఖ్యం. యేసు ప్రపంచ మానవాళి కోసం సిలువ మీద భాదపడుతూ ఇచ్చింది రక్తము.నేడున్న మనిషి రోగాలు కోసం డబ్బులు ఖర్చుపెట్టుకుంటూ తగ్గించుకోవాలనే ఆలోచనలతో ఉంటున్నారే తప్ప ఉచితముగా యేసుక్రీస్తు కష్టపడి ఇచ్చిన రక్తంతో పాపాన్ని ప్రక్షాళన చేసుకోవడానికి ఈ రోజు మనిషికి ఆసక్తి లేదు.
12) ప్రపంచంలో ఎవరు పోగొట్టుకోలేని పాపాన్ని తీసివేయడానికి పరలోకపు తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి,సిలువ మరణ పునరుర్ధానమునుజరిపించాడు. అయన అంత ఇబ్బంది పడి మానవాళికి రక్షణను ప్రసాదిస్తే యేసుక్రీస్తు రక్తాన్ని స్వీకరించే వారు కరువైయ్యారు. మనిషికి రోగం పోగొట్టుకోవాలన్నంత ఆసక్తిపాపంపై లేదు. ఈ భూమి మీదకు యేసుక్రీస్తు పంపించకపోతే ప్రపంచ పరిస్థితి ఏంటి? రక్షణ అనే పధం తెలియకుండా పాపంలో మగ్గి శవాలు అయ్యి నరకానికి వెళ్ళిపోయేవారము. ఏదో ఒక రోజు రోగం ఉన్న ,లేకున్నా చావటం కాయం. నీవు దేవుని కోసం బ్రతుకున్నప్పుడు నీ అవసరత దేవునికి ఉంటే దేవుడే నీకు రోగం నయం చేయటం కాయం. నీ అవసరత ఉంటె భూమి మీద ఉంచుతాడు.
13) రోగం కొరకు భయపడి జాగ్రత్తలు తీసుకుంటారే కానీ పాపం కొరకు భయపడి జాగ్రత్తలు తీసుకోరు.శరీరానికి రోగం అంటుకోకుండా ఉండడానికి జాగ్రతలు తీసుకుంటారే కానీ పాపం ఆత్మకు అంటుకోకూడదని జాగ్రతలు తీసుకోవడం లేదు. రోగం ఉందని భాదపడటం కంటే ఈ పాపంతో నేను చస్తే నా జీవితం ఏమైపోతుందోఅని, నరకానికి వెళ్లి కోట్ల సంవత్సరాలు కాళిపోతానేమో అని భాదపడాలి. ప్రపంచంలో ఎవరు తీయలేని పాపాన్ని తన రక్తంతో తీసి, పవిత్రులుగా మలచి , పరలోకానికి తీసుకుని వెళ్ళాలని అయన ఆలోచిస్తుంటే మనిషి మాత్రం శరీరానికి అంటున్న రోగం పై ఆలోచిస్తున్నాడు. ముందుగా మనిషికి పోవాల్సింది పాపము. పాపులైన మనల్ని రక్షించుటకు యేసు ఈ లోకానికి వచ్చాడు, రక్తాన్ని కార్చాడు,మరణించాడు. ఒక దినాన మరణించే మనకు ఈ జీవితంపై ఆలోచనలు ఎందుకు? త్వరగా పరలోకం వెళ్ళాలనే ఆలోచనలతో ఉండవలసినది పోయి రోగం పై ఆలోచనలు ఎందుకు???
14) పాపంతో దేవుని ఎదుట పవిత్రముగా ఉండలేము . ఒక దినాన మట్టిలోకి వెళ్ళిపోయే శరీరమునకు వచ్చిన రోగం గూర్చి ఆలోచించుట వృధా కానీ పరలోకం వెళ్ళవలసిన ఆత్మ గూర్చి ఆలోచన లేదు. శరీరానికి రోగాలు రాకుండా ఎంత జాగ్రతగా కాపాడుకుంటూన్నామో అలానే ఆత్మను కూడ పాపాన్ని అంటకుండా, ఈ లోక మాలిన్యాన్ని అంటుకోకుండా జాగ్రతగా కాపాడుకోవాల్సిన భాద్యత మనకు ఉంది........

Post a Comment

أحدث أقدم