jivitha yatralo nadhu guri nivega

జీవిత యాత్రలో నాదు గురి నీవెగా - నీకు సాటియెవ్వరు యేసువా
నీవు నడిచావు కెరటాలపై - నన్ను నడిపించుమో యేసువా "జీవిత"
1. నన్ను నడిపించు చుక్కాని నీవేకదా - నీవేకదా
నన్ను కాపాడు దుర్గంబు నీవేగదా - నీవేకదా
నీదు వాక్యంబు సత్యంబుగా - నాకు నిరతంబు జీవంబెగా
నేను పయనించు మార్గంబెగా - నన్ను నడిపించుమో యేసువా "జీవిత"
2. నాకు నిరతంబు మధిలోన నీద్యానమే - నీద్యానమేనేను స్వరమెత్తి వినిపింతు నీ గానమే - నీ గానమే
నాకు నీవేగా సర్వస్వము - నీదు నామంబె ఆధారము
నాకు సర్వేశ్వరుడనీవెగా - నిన్ను స్తుతియింతుమో యేసువా "జీవిత"

Post a Comment

أحدث أقدم