Song no: 20
-
ప్రభువా నీలో జీవించుట -2
- సంగీతములాయే - పెను తుఫానులన్నియు -2
సమసిపోవునే - నీ నామ స్మరణలో -2
సంతసమొందే - నా మది యెంతో -2
ప్రభువా నీలో జీవించుట.....
- పాప నియమమును - బహు దూరముగా చేసి -2
పావన ఆత్మతో - పరిపూర్ణమై -2
పాదపద్మము - హత్తుకొనెదను -2
ప్రభువా నీలో జీవించుట.....
- నీలో దాగినది - కృప సర్వోన్నతముగా -2
నీలో నిలచి - కృపలనుభవించి -2
నీతోనే యుగ - యుగములు నిల్చెద -2
ప్రభువా నీలో జీవించుట.....
- నూతన వధువునై -శుద్ధ వస్త్రములు ధరించి -2
నూతనమైన - శుభకాంక్షలతో -2
నూతన షాలేమై - సిద్ధమౌదు నీకై -2
ప్రభువా నీలో జీవించుట-2
కృపాబాహుళ్యమే నా యెడ - కృపాబాహుళ్యమే -2
ప్రభువా నీలో జీవించుట .....
కృపాబాహుళ్యమే నా యెడ - కృపాబాహుళ్యమే -2
ప్రభువా నీలో జీవించుట
కామెంట్‌ను పోస్ట్ చేయండి