Anandham yesutho anandham jaya gambeera dhwanitho ఆనందం యేసుతో ఆనందం జయగంభీర ధ్వనితో పాడెదను

Song no: 32

    ఆనందం యేసుతో ఆనందం
    జయగంభీర ధ్వనితో పాడెదను
    జయరాజాధిరాజుతో సాగెదను    ||ఆనందం||

  1. నా ప్రాణమునకు సేదదీర్చి
    తన నామము బట్టి నీటి మార్గమున నన్ను నడిపించెను
    ఏ అపాయమునకు నేను భయపడకుందును    ||ఆనందం||

  2. నా ప్రభుని కృప చూచిన
    నాటినుండి నన్ను నేనే మరచిపోతినే
    నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక చూచెదనా         ||ఆనందం||

  3. సిలువను యేసు సహించెను
    తన యెదుట ఉంచబడిన జ్యేష్ఠుల సంఘముకై
    అవమానము నొందె - నాకై మరణము గెలిచె        ||ఆనందం||

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Copyright © Lyrics List. Designed by OddThemes