Song no: 62

    ఆదరణ కర్తవు ఆనాధునిగ విడువవు

    నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు -2

  1. అల్పుడనైయున్న నన్ను చెరదీసితివా
    అనాది నీ ప్రేమయే నన్నెంతో బలపరచెనే

    ఆనంద భరితుడనై వేచియుందును నీరాకకై  -2     II ఆదరణ II

  2. నీ నిత్య కృపలోనే ఆదరణ కలిగెనే
    నీ కృపాదానమే నన్నిలలో నిలిపెనే

    నీ నిత్య కృపలోనే  నన్ను స్థిరపరచు కడవరకు -2  II ఆదరణ II

    యేసయ్య! యేసయ్య!
    యేసయ్య! యేసయ్య!!