Ganamu jeyundu sukeerthanaku గానము జేయుండు సుకీర్తనను యెహోవాను గూరిచి క్రొత్తం గాను

Song no: #2

    గానముఁ జేయుఁడు సుకీర్తనను } 2
    యెహోవాను గూరిచి క్రొత్తఁ గాను రక్తిగను ||గానము||

  1. తన్నామము నుతించి యతని } 2
    రక్షఁ జెన్నుఁగ సారెఁ బ్రసిద్ధముఁ జేసి పన్నుగ నన్యులలో దన్మహిమ యం దున్నత చిత్రములను జాటండి ||గానము||

  2. ఘనతయు మహత్మ్యమును } 2
    దద్ఘనని యెదుటనుండు ఘనబలమును వినతమౌ సౌందర్యమును నతనివి నిర్మల స్థలమున విలసిల్లు ||గానము||

  3. పరిశుద్ధాలంకారముతో } 2
    నా పరమాత్మారాధన పరులై యుండండి ధరణి సకల జనులారా లోక గురుని యెదుట భీతిఁ గొనుచు నుండండి ||గానము||

  4. పరిపాలించుచున్నాఁడనుచు } 2
    తోడి నరులతోఁజెప్పుఁడిద్ధరఁ గదకుండ స్థిరముగఁ జేయు సత్యముగా జనుల కరిమురిగాను న్యాయము విమర్శించు ||గానము||

  5. ఏమనిన నా మహాత్ముండు } 2
    వచ్చు నీ మహికి న్యాయము నేర్పరచుటకు భూమిజనులకు నీతి సత్యములథో మించు న్యాయము విమర్శించు ||గానము||

  6. జనులారా యా యెహోవాకు } 2
    మహిమను బలమును సమర్పణము జేయండి వినయముతోఁ గానుకలను తీసి కొని తత్ప్ర్రాకారమందున వసియింపండి ||గానము||

Blogger ఆధారితం.