Rare mana yesu swamini juthumu korke lora రారే మన యేసు స్వామిని జూతము కోర్కె – లూర

Song no: #83

    రారే మన యేసు స్వామిని జూతము కోర్కె లూర ప్రియు లారా పేర్మిని గూరిమి భక్తులఁ విందుట భూరిద యామృత సారము లోలికెడు చారు కటాక్ష వి శాలేక్షణుఁడఁట నారకులగు నర నారీజనులకు దారక మొసఁగను దానె పిలుచునఁట దారుణ పాప మ హారణ్యమునకుఁ గారుచిచ్చు గతి గంపడువాఁడట ఘోరదరిద్రతఁ గూల్చెడివాఁడట సారం బగు తన సభకు మకుటమఁ ట ||రారే||

  1. పతిత పావనమౌ వేల్పఁట అనాది దేవ సుతుడై యిలఁ జేరి నాఁడఁట సతతము కడు దురి తతమోయుతమగు ప్రతి దేశమునకు హితభాస్కరుఁడఁట అతిలిత మోక్షో న్నత గుణగణుఁడఁట కుతలంబున స ద్గతి రహితంబగు పతితులఁ గావను మృతుడైనాఁ డఁట అతిపుణ్య తను క్షత శోణితమును వ్రతముగ సిలువను నతడొసంగెనఁట మృతిని జయించుచు బ్రతికి లేచెనఁట మతి నమ్మిన మన గతి యితఁడేనఁట ||రారే||

  2. తుదిలేని మహిమవాఁడఁట తనుఁగొల్చు సాధు హృదయుల సొమ్ము మూటఁట చెదరిన గొఱ్ఱెల వెదకవచ్చెనఁట చిదురుపలగు జన హృదయము లన్నిటఁ బదిలముగా నె మ్మది నిడువాఁడఁట నదితట మఠ జన వదనముల స మ్మద శుభవార్తనుఁ బలికినవాఁడఁట సదయత నంధుల కక్షుల నిడెనఁట వెదకి బధిరులకు వీను లొసఁగె నఁట సదమల మోక్ష ప్రదుఁడగు విభుఁడఁట యిదిగో మనకిత డేలినవాఁడఁట ||రారే||




    Raare Mana Yesu Swaamini
    Joothamu Korke – Loora Priyulaaraa Permini
    Goorimi Bhakthula Jeruva Vindata
    Bhoorida Yaamrutha Saaramu Lolikedu
    Chaaru Kataaksha Vi – shaalekshanudata
    Naarakulagu Nara – Naaree Janulaku
    Daaraka Mosaganu Daane Pilachunata
    Daaruna Paapa Ma-haaranyamunaku
    Gaaru Chichchu Gathi Ganpaduvaadata
    Ghora Daridratha Goolchedi Vaadata
    Saarambagu Thana Sabhaku Makutamata ||Raare||
    Pathitha Paavanamou Velpata
    Anaadi Deva Suthudai – Ila Jerinaadata
    Sathathamu Kadu Duri – Thathamoyuthamagu
    Prathi Deshamunaku – Hitha Bhaaskarudata
    Athulitha Moksho – nnatha Gunaganudata
    Kuthalambuna Sa-dgathi Rahithambagu
    Pathithula Gaavanu – Mruthudainaadata
    Athi Punya Thanu – Kshatha Shonithamunu
    Vrathamuga Siluvanu Nathadosangenata
    Mruthini Jayinchuchu Brathiki Lechenata
    Mathi Nammina Mana Gathi Yithadenata ||Raare||

    Thudaleni Mahima Vaadata
    Thanu Golchu Saadhu – Hrudayula Sommu Mootata
    Chedarina Gorrela – Vedaka Vachchenata
    Chidurupalagu Jana Hrudayamulannita
    Badilamugaa Ne-mmadi Niduvaadata
    Nadithata Mata Jana Vadanamula Sa
    mmada Shubhavaarthanu – Balikinavaadata
    Sadayatha Sandhula – Kakshula Nidenata
    Vedaki Badhirulaku – Veenulosage Nata
    Sadamala Moksha Prabhudagu Vibhudata
    Yidigo Manakitha Delinavaadata ||Raare||
Blogger ఆధారితం.