Nadu vacchinattlu gadhu nedu vacchuta నా(డు వచ్చినట్లు గాదు నేఁడు వచ్చుట

(రాగం : ముఖరి  )
(ఛాయ : హృదయమనెడు తలుపునొద్ద )
song 228


నా(డు వచ్చినట్లు గాదు నేఁడు వచ్చుట తేరి చూడరాదు క్రీస్తు నింకఁ జొత్తు మెచ్చుట ||నాఁడు||

1. మొదట గొఱ్ఱెపిల్ల రీతి నొదిగి వచ్చెఁగా యిపుడు కొదమ సింహమయ్యె మనకు గుండె దిగులుగా ||నాఁడు||

2. దాసునివలె దొల్లిఁ జూచినాముగా యిపుడు దోసము లెంచి దండింప దొరయైనాఁడుగా ||నాఁడు||

3. ఏ తట్టు బోయిన మనకు నెదురు వచ్చెఁగా పిడుగు రీతి వాని యుగ్రమైన దృష్టి హెచ్చఁగా ||నాఁడు||

4. కొండ వండ లందు డాగి యుండలేముగా వాని యండనుండి మండు నగ్ని యదిగో వచ్చెఁగా ||నాఁడు||

5. దిక్కుగా నున్నట్లు నితర దేవతలను నమ్మి వట్టి పుక్కిటి పురాణములకుఁ బోయి చెడితిమి ||నాఁడు||

6. వీధుల బోధించు వారి వినక పోతిమి యిపుడు బాధఁ బొంది నరకాగ్నిలోఁ బడఁబాలైతిమి ||నాఁడు|| 


Blogger ఆధారితం.