Mangalame Yesunaku manujawatharunaku మంగళమే యేసునకు మనుజావతారునకు

Song no: #73

    మంగళమే యేసునకు మనుజావతారునకు శృంగార ప్రభువునకు క్షేమాధిపతికి ||మంగళమే||

  1. పరమ పవిత్రునకు వరదివ్య తేజునకు నిరుపమానందునకు నిపుణ వద్యునకు ||మంగళమే||

  2. దురిత సంహారునకు వరసుగుణోదారునకు కరుణా సంపన్నునకు జ్ఞానదీప్తునకు ||మంగళమే||

  3. సత్య ప్రవర్తునకు సద్దర్మశీలునకు నిత్యస్వయంజీవునకు నిర్మలాత్మునకు ||మంగళమే||

  4. యుక్తస్తోత్రార్హూనకు భక్తరక్షామణికి సత్యపరంజ్యోతి యగు సార్వభౌమునకు ||మంగళమే||

  5. నరఘోర కలుషముల నురుమారంగ నిల కరుదెంచిన మాపాలి వర రక్షకునకు ||మంగళమే||

  6. పరమపురి వాసునకు నరదైవ రూపునకు పరమేశ్వర తనయునకు బ్రణుతింతుము నిన్ను ||మంగళమే||
Blogger ఆధారితం.