Sajeevudavaina Yesayyaa ninnasrayinchina nee variki సజీవుడవైన యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి

Song no: 185

సజీవుడవైన యేసయ్యా
నిన్నాశ్రయించిన నీ వారికి
సహాయుడవై తృప్తి పరచితివే
సముద్రమంత సమృద్ధితో (2)
ఆనందించెద నీలో – అనుదినము కృప పొంది
ఆరాధించెద నిన్నే – ఆనంద ధ్వనులతో (2)

ధన రాసులే ఇలా – ధనవంతులకు – ఈ లోక భాగ్యము

దాచిన మేలులెన్నో – దయచేసినావే – ఇహ పరమున నాకు (2)

శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివి

శ్రేష్టమైన నీ వాగ్ధానములతో (2)         ||సజీవుడవైన||

క్షేమము నొందుటయే – సర్వ జనులకు – ప్రయాసగా మారే

క్షేమాధారము నీవై – దీర్ఘాయువుతో – సంతృప్తి పరతువు నన్ను (2)

నిత్య నిబంధనగా నీ వాత్సల్యమును చూపితివే

నిత్యమైన నీ సత్య వాక్యముతో (2)         ||సజీవుడవైన||

నలువది ఏండ్లు – నీ స్వాస్థ్యమును – మోసినది నీవే

నీ కృప కాంతిలో – నా చేయి విడువక – నడిపించుచున్నది నీవే (2)

పరమ రాజ్యములో మహిమతో నింపుటకు అనుగ్రహించితివే

పరిపూర్ణమైన నీ ఉపదేశమును (2)         ||సజీవుడవైన||

Sajeevudavaina Yesayyaa

Ninnaashrayinchina Nee Vaariki

Sahaayudavai Thrupthi Parachithive

Samudramantha Samruddhitho (2)

Aanandincheda Neelo – Anudinamu Krupa Pondi

Aaraadhincheda Ninne – Aananda Dhvanulatho (2)

Dhana Raasule Ila – Dhanavanthulaku – Ee Loka Bhaagyamu

Daachina Melulenno – Dayachesinaave – Iha Paramuna Naaku (2)

Shramala Maargamunu Nireekshana Dwaaramuga Chesithive

Shreshtamaina Nee Vaagdhaanamulatho (2)       ||Sajeevudavaina||

Kshemamu Nondutaye – Sarva Janulaku – Prayaasagaa Maare

Kshemaadhaaramu Neevai – Deerghaayuvutho – Santhrupthi Parathuvu Nannu(2)

Nithya Nibandhanagaa Nee Vaathsalyamunu Choopithive

Nithyamaina Nee Sathya Vaakyamutho (2)       ||Sajeevudavaina||

Naluvadi Endlu – Nee Swaasthyamunu – Mosinadi Neeve

Nee Krupa Kaanthilo – Naa Cheyi Viduvaka – Nadipinchuchunnadi Neeve (2)

Parama Raajyamulo Mahimatho Nimputaku Anugrahinchithive

Paripoornamaina Nee Upadeshamunu (2)       ||Sajeevudavaina||
Blogger ఆధారితం.