Parugethedha parugethedha pilupunaku thagina పరుగెత్తెదా పరుగెత్తెదా పిలుపుకు తగిన బహుమతికై

Song no: 124
    పరుగెత్తెదా పరుగెత్తెదా
    పిలుపుకు తగిన బహుమతికై
    ప్రభు యేసుని ఆజ్ఞల మార్గములో
    గురి యొద్దకే నేను పరుగెత్తెదా (2) || పరుగెత్తెదా ||

  1. దైవ భయము కలిగి – శరీరేఛ్చలను విడిచి (2)
    అక్షయ కిరీటము కొరకే – ఆశతో పరుగెత్తెదా (2) || పరుగెత్తెదా ||

  2. ఆత్మాభిషేకము కలిగి – ఆత్మల భారముతో (2)
    అతిశయ కిరీటము కొరకే – అలయక పరుగెత్తెదా (2) || పరుగెత్తెదా ||

  3. యేసు వైపు చూచుచు – విశ్వాసము కాపాడుకొనుచు (2)
    వాడబారని కిరీటముకే – వాంఛతో పరుగెత్తెదా (2) || పరుగెత్తెదా ||

Blogger ఆధారితం.