Yesuraju rajularajai tharaga vacchuchunde యేసురాజు రాజులరాజై త్వరగా వచ్చుచుండే

Song no: 13

    యేసురాజు రాజులరాజై - త్వరగా వచ్చుచుండే -2
    త్వరగ వచ్చుచుండే -2
    హోసన్నా జయమే  -2
    హోసన్నా జయం మనకే -2
    యేసురాజు రాజులరాజై - త్వరగా వచ్చుచుండే

  1. యోర్దాను ఎదురైనా - ఎర్ర సంద్రము పొంగిపొర్లినా -2
    భయము లేదు జయము మనదే
    విజయ గీతము పాడెదము || హోసన్నా ||

  2. శరీర రోగమైనా - అది ఆత్మీయ వ్యాధియైనా -2
    యేసు గాయముల్ స్వస్థపరచును -2
    రక్తమే రక్షణ నిచ్చున్ -2 || హోసన్నా ||

  3. హల్లెలూయ స్తుతి మహిమ - ఎల్లప్పుడు
    హల్లెలూయ స్తుతి మహిమ -2
    యేసురాజు మనకు ప్రభువై - త్వరగా వచ్చుచుండె || హోసన్నా ||
Blogger ఆధారితం.