Yesayya nee krupa nanu amarathyaniki యేసయ్యా నీ కృపా నను అమరత్వానికి అర్హునిగా మార్చెను

Song no: 83
    యేసయ్యా నీ కృపా - నను అమరత్వానికి అర్హునిగా మార్చెను - యేసయ్యా నీ కృపా  || యేసయ్యా ||
  1. నీ హస్తపు నీడకు పరుగెత్తగా - నీ శాశ్వత కృపతో నింపితివా
    నీ సన్నిధిలో దీనుడనై - కాచుకొనెద నీ కృప ఎన్నడు  || యేసయ్యా ||

  2. నీ నిత్య మహిమకు పిలిచితివా - నీ స్వాస్ధ్యముగా నన్ను మార్చితివా
    ఆత్మాభిషేకముతో స్ధిరపరచిన - ఆరాధ్యుడా నిన్నే ఘనపరతును  || యేసయ్యా ||

  3. గువ్వవలె నే నెరిగి నిను చేరనా - నీ కౌగిటనే నొదిగి హర్షించనా
    ఈ కోరిక నాలో తీరునా  ? - రాకడలోనే తీరును  || యేసయ్యా ||
Blogger ఆధారితం.