Yesayya nannu korukunna nija snehithuda యేసయ్య నను కొరుకున్న నిజస్నేహితుడా

Song no: 165

    యేసయ్య! నను కొరుకున్న నిజస్నేహితుడా
    నీ యవ్వన రక్తము కార్చి - నీ ప్రేమ ప్రపంచంలో చేర్చినావు } 2
    నిను వీడి జీవింప నా తరమా
    నిను ఆరాధింప నా బలమా !
    మది మందిరాన కొలువైన నా వరమా !! } 2

  1. నా పూర్ణ హ్రుదయముతో నిన్ను వెదికితిని
    నీ ఆజ్ఞలను విడిచి - నన్ను తిరుగనియ్యకుము } 2
    దైర్యమునిచ్చే - నీ వాక్యములో
    నీ బలము పొంది - దుష్టుని ఎదిరింతును } 2 || యేసయ్య ||

  2. నా గురి గమ్యమైన నిను చేరిటకు
    ఈ లోక నటనలు చూచి - నన్ను మురిసిపోనివ్వకు
    పొందబోవు -బహుమానమునకై
    నా సిలువను మోయుచు - నిను వెంబడించెదను } 2 || యేసయ్య ||

  3. నీ సంపూర్ణ సమర్పణయే - లోక కళ్యాణము
    నీ శక్తి సంపన్నతలే - ఇల ముక్తిప్రసన్నతలు
    మహనీయమైన - నీ పవిత్రతను
    నా జీవితమంతయు ఘనముగ ప్రకటింతును } 2 || యేసయ్య ||
Blogger ఆధారితం.