Nenendhukani nee sotthuga marithini lyrics నేనెందుకని నీ సొత్తుగా మారితినియేసయ్యా నీ రక్తముచే

నేనెందుకని నీ సొత్తుగా మారితిని
యేసయ్యా నీ రక్తముచే - కడుగబడినందున
నీ అనాది ప్రణాళికలో - హర్షించెను నా హృదయసీమ

1. నీ పరిచర్యను తుదముట్టించుటే-నా నియమమాయెనే
నీ సన్నిధిలో నీ పోందుకోరి - నీ స్నేహితుడనైతినే
అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును "నేనె"

2. నీ శ్రమలలో - పాలొందుటయే - నా దర్శనమాయెనే
నా తనువందున - శ్రమలుసహించి- నీ వారసుడనైతినే
అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును "నేనె"

3. నీలో నేనుండుటే - నాలో నీవుండుటే - నా ఆత్మీయ అనుభవమే
పరిశుద్ధాత్ముని అభిషేకముతో - నే పరిపూర్ణత చేందెద
అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును "నేనె"
Blogger ఆధారితం.