Nee mukhamu manoharamu nee swaramu నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము

Song no: 94

    నీ ముఖము మనోహరము - నీ స్వరము మాధుర్యము
    నీ పాదాలు అపరంజి మయము

    యేసయ్యా నా ప్రాణ ప్రియుడా - మనగలనా నిను వీడి క్షణమైన } 2

  1. నీవే నాతోడువై నీవే నాజీవమై - నా హృదిలోన నిలిచిన జ్ణాపికవై } 2
    అణువణువున నీకృప నిక్షిప్తమై –
    నను ఎన్నడు వీడని అనుబంధమై } 2 || యేసయ్య ||

  2. నీవే నా శైలమై నీవే నాశృంగమై - నా విజయానికే నీవు భుజబలమై } 2
    అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై –
    నను వెనుదీయనీయక వెన్ను తట్టినావు } 2 || యేసయ్య ||

  3. నీవే వెలుగువై నీవే ఆలయమై - నా నిత్యత్వమునకు ఆద్యంతమై } 2
    అమరలోకాన శుద్ధులతో పరిచయమై –
    నను మైమరచి నేనేమి చేసేదనో } 2 || యేసయ్య ||
Blogger ఆధారితం.