Naa dhipamu yesayya neevu veliginchinavu నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు

Song no: 89

    నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు
    సుడిగాలిలో నైనా - జడివానలోనైనా
    ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము
    నీవు వెలిగించిన దీపము - నీవు వెలిగించిన దీపము

  1. ఆరని దీపమై దేదీప్యమానమై
    నాహృదయ కోవెలపై దీపాల తోరణమై } 2
    చేసావు పండగ - వెలిగావు నిండుగా  } 2 || నా దీపము ||

  2. మారని నీ కృప నను వీడనన్నది
    మర్మాల బడిలోన సేద దీర్చుచున్నది } 2
    మ్రోగించుచున్నది - ప్రతిచోట సాక్షిగా  } 2 || నా దీపము ||

  3. ఆగని హోరులో ఆరిన నేలపై
    నాముందు వెలసితివే సైన్యములకధిపతివై } 2
    పరాక్రమశాలివై - నడిచావు కాపరిగా } 2 || నా దీపము ||
Blogger ఆధారితం.