Mahonnathuda nee krupalo nenu nivasinchuta మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట

Song no: 10

    మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట
    నా జీవిత ధన్యతై యున్నది -1
    మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట -3
    నా జీవిత ధన్యతై యున్నది -1

  1. మోడుబారిన జీవితాలను
    చిగురింప చేయగలవు నీవు -2
    మారా అనుభవం మధురముగా
    మార్చగలవు నీవు } 2 || మహో ||

  2. ఆకు వాడక ఆత్మఫలములు
    ఆనందముతో ఫలియించనా -2
    జీవజలముల ఊటయైన
    నీ యోరను నను నాటితివా } 2 || మహో ||

  3. వాడబారని స్వాస్థ్యము నాకై
    పరమందు దాచియుంచితివా -2
    వాగ్దానా ఫలము అనుభవింప
    నీ కృపలో నన్ను పిలచితివా } 2 || మహో ||
Blogger ఆధారితం.