Krupa sathya sampurnuda sarvalokanike కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే

Song no: 66

    కృపా సత్య సంపూర్ణుడా -1
    సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా -2
    నా సన్మానానికే మహనీయుడవు నీవేనయా ...
    మహనీయుడవు నీవేనయా ...

  1. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా
    దాటిరే నీ జనులు బహు క్షేమముగా -2
    ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే -2 || కృపా ||

  2. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయ్యగా
    నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా -2
    నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే -2 || కృపా ||

  3. నైవేద్యములు, దహన బలులు నీ కోరవుగా
    నా ప్రాణాత్మ శరీరము బలిఅర్పణ కాగా -2
    నా జిహ్వబలులు, స్తోత్ర బలులుగ  మారిపోయెనే -2 || కృపా ||
Blogger ఆధారితం.